Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా కుక్కను దొంగలెత్తుకెళ్లారు !! పోలీసులను ఆశ్రయించిన యజమాని

మా కుక్కను దొంగలెత్తుకెళ్లారు !! పోలీసులను ఆశ్రయించిన యజమాని

Phani CH

|

Updated on: Nov 09, 2024 | 12:24 PM

దొంగలెవరైనా ఇంట్లో చొరబడితే ఖరీదైన వస్తువులో, డబ్బు, నగలు లాంటివి ఎత్తుకెళ్తారు. కానీ వీళ్లు ఓ ఇంట్లోని పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శునకం కనిపించకపోవడంతో ఆ ఇంటి యజమాని తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా శ్రీరాం నగర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు, కుక్క యజమాని తెలిపిన వివరాలు ప్రకారం, తమ కుమార్తె ఐదేళ్ల క్రితం రెండు నెలల వయసున్న చిన్న హచ్‌ కుక్కపిల్లిను హైదరాబాదునుంచి తీసుకొచ్చిందని, అప్పటినుంచి దానిని తమ కుటుంబసభ్యుల్లో ఒకనిగా పెంచుకుంటున్నామని యజమాని తెలిపారు. రెండు రోజుల క్రితం ఇంటిముందు గేటు తెరిచి ఉండటంతో హచ్‌ కుక్కపిల్ల బయటకు వెళ్లిందని తెలిపారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు తమ కుక్కను ఎత్తుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌పైన వచ్చినవారిలో ఓ మహిళా కూడా ఉందని, ఆమె కుక్క కనిపించకుండా చున్నీతో కప్పి తీసుకెళ్లినట్టు తెలిపారు. అది గమనించిన యజమాని కుక్కకోసం వారిని వెంబడించానని, అయితే వారు తప్పించుకుపోయారని తెలిపాడు. ఈ దృశ్యాలు లద్మాపూర్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయని తెలిపారు. యజమాని మంథని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్నామని, దయచేసి వదిలేయాలని యజమాని వేడుకుంటున్నాడు. ఘటనపై సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎడారి దేశం‌లో వింత.. మంచు దుప్పటిలో దుబాయ్‌

Puhspa 2: ఫస్ట్ రోజే రూ.270 కోట్లా !!

Puhspa 2: రిలీజ్ కాకముందే రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2

ఒకే స్టేజ్‌పై రెండు సింహాలు.. అస్సలు మిస్ అవ్వకండి

Janaka Aithe Ganaka: బోల్డ్ కాన్సెప్ట్‌తో కామెడీ బేస్‌గా హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సుహాస్ సినిమా