ఈ క్షణం నుంచే హెల్మెట్ మస్ట్.. లేకపోతే జాగ్రత్త !!
హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాజధానిలో మూడు రోజుల్లోనే హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు వాహనచోదకులు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేశామని చెప్పారు.
హెల్మెట్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 215 మంది చనిపోయారని ట్రాఫిక్ పోలీస్‌లు ప్రకటించారు. వారిలో 100 మంది ద్విచక్ర వాహన చోదకులే అని పేర్కొన్నారు. వీరిలో 46 మంది హెల్మెట్ ధరించని కారణంగానే చనిపోయారని, హెల్మెట్ ధరిస్తే క్షతగాత్రులుగా మారే ప్రమాదం 70 శాతం, మృత్యువాతపడే ముప్పు 40 శాతం తగ్గుతుందని వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే చోదకులకు రిస్క్ మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని ద్విచక్ర వాహనచోదకులు 100 శాతం హెల్మెట్ ధరించేలా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అన్నారు. అదే విధంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైనా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించని వారికి రూ.200, రాంగ్ రూట్ డ్రైవింగ్‌కి రూ.2 వేలు జరిమానా విధిస్తామని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లికూతురుని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ??
మా కుక్కను దొంగలెత్తుకెళ్లారు !! పోలీసులను ఆశ్రయించిన యజమాని
ఎడారి దేశంలో వింత.. మంచు దుప్పటిలో దుబాయ్
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

