Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urea Imports: ఆ దేశం నుంచి మెుదటి సారిగా యూరియా దిగుమతి చేసుకుంటున్న భారత్.. ఎందుకంటే..

Urea Imports: భారత్ మొదటిసారిగా భారీ పరిమాణంలో యూరియాను దిగుమతి చేసుకుంటోంది. సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ కంపెనీ శామ్ సంగ్ భారత్ లోని పశ్చిమ తీరాన ఉన్న న్యూ మంగళూరుకు షిప్‌మెంట్ ఏర్పాటు చేస్తోంది.

Urea Imports: ఆ దేశం నుంచి మెుదటి సారిగా యూరియా దిగుమతి చేసుకుంటున్న భారత్.. ఎందుకంటే..
Urea
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 18, 2022 | 6:07 PM

Urea Imports: భారత్ మొదటిసారిగా అమెరికా నుంచి భారీ పరిమాణంలో యూరియాను దిగుమతి చేసుకుంటోంది. సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ కంపెనీ శామ్ సంగ్ భారత్ లోని పశ్చిమ తీరాన ఉన్న న్యూ మంగళూరుకు షిప్‌మెంట్ కోసం అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ పోర్ట్‌లో 47,000 టన్నుల గ్రాన్యులర్ యూరియాను లోడ్ చేయనుంది. టన్నుకు  రవాణా ఛార్జీలతో కలుపుకుని 716.5 డాలర్ల ధరతో సరఫరా చేయబడుతుంది. యూఎస్ ఇప్పటివరకు అప్పుడప్పుడు యూరియా ఎగుమతిదారుగా మాత్రమే ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2019-20లో కేవలం 1.47 టన్నులు, 2020-21లో 2.19 టన్నులు, 2021-22లో 43.71 టన్నులుగా భారతదేశానికి ఎగుమతులు జరిగాయి.

భారత్ 2021-22లో 6.52 బిలియన్ డాలర్ల విలువైన 10.16 మిలియన్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంది. ప్రధానంగా చైనా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఉక్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియాల నుంచి దిగుమతులు జరిగాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కంటే అమెరికాలో ధరలు కొంత తక్కువగానే ఉన్నాయి. దీనివల్ల యూఎస్ నుంచి యూరియా దిగుమతులు సరైనదే అని నిపుణులు అంటున్నారు. సరకు రవాణా ఖర్చులు సైతం తక్కువగానే ఉండటంతో పాటు.. రవాణా సమయం కూడా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?