Maize Farming: మొక్కజొన్నకి పెరిగిన డిమాండ్‌.. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ..!

Maize Farming: ప్రపంచంలోని దాదాపు 165 దేశాల్లో మొక్కజొన్న పండిస్తారు. మొత్తం ప్రపంచ ధాన్యం ఉత్పత్తిలో మొక్కజొన్న వాటా 39 శాతం. ఇది చాలా వరకు అమెరికాలో ఉత్పత్తి అవుతుంది.

Maize Farming: మొక్కజొన్నకి పెరిగిన డిమాండ్‌.. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ..!
Maize Farming
Follow us
uppula Raju

|

Updated on: Mar 27, 2022 | 5:46 AM

Maize Farming: ప్రపంచంలోని దాదాపు 165 దేశాల్లో మొక్కజొన్న పండిస్తారు. మొత్తం ప్రపంచ ధాన్యం ఉత్పత్తిలో మొక్కజొన్న వాటా 39 శాతం. ఇది చాలా వరకు అమెరికాలో ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు పునాదిలాంటిది. భారతదేశంలో మొక్కజొన్నను ఎక్కువగా ఖరీఫ్ సీజన్‌లో పండిస్తారు. కొన్ని ప్రదేశాలలో ఏడాది పొడవునా సాగు చేస్తారు. మొక్కజొన్న మన దేశంలో వరి, గోధుమల తర్వాత మూడో అతిపెద్ద తృణధాన్యాల పంట. దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఇది 10 శాతం. మొక్కజొన్న మనుషులకే కాదు జంతువులకు కూడా గొప్ప ఆహారం. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పటికే అధిక నాణ్యత, దిగుబడినిచ్చే మొక్కజొన్న రకాలను అభివృద్ధి చేశారు. అక్కడి నేల, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక రకాలు కనుగొన్నారు. దీంతో రైతులు మొక్కజొన్న నుంచి అత్యధిక దిగుబడి సాధించి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మొక్కజొన్నకు ఇప్పుడు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు మరింత సంపాదించవచ్చని ఆశిస్తు్న్నారు.

మొక్కజొన్నను ఆహారంగా మాత్రమే కాకుండా స్టార్చ్, నూనె, ప్రోటీన్, ఫార్మాస్యూటికల్, సౌందర్య సాధనాలు, వస్త్రాలు, గమ్, కాగితం, ప్యాకేజీ వంటి పరిశ్రమలకు ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. దీని డిమాండ్ ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉండడానికి ఇదే కారణం. మనం మార్కెట్ నుంచి తెచ్చే మొక్కజొన్న పిండి లేదా గింజలు, అవి అనేక దశల తర్వాత ఆ రూపానికి చేరుకుంటాయి. కోత తర్వాత మొక్కజొన్నలు చాలా తేమను కలిగి ఉంటాయి. కాబట్టి అవి పొడిగా చేయడానికి ఎండబెట్టడం అవసరం. చాలా మంది రైతులు డాబాపై లేదా పెరట్లో ఆరబెట్టడానికి ఇష్టపడతారు. అయితే చాలాసార్లు వర్షం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేటి కాలంలో మొక్కజొన్నను ఎండబెట్టడానికి యంత్రాలు రెడీగా ఉన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో మొక్కజొన్న ధరలు తరచుగా పడిపోతాయి. దీనిని నివారించేందుకు రైతులు మొక్కజొన్న నుంచి ధాన్యాన్ని తీసిన తర్వాత వాటిని కోల్డ్‌స్టోరేజీలో ఉంచి ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరకు విక్రయించుకుంటే మంచిది.

Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. పలువురు మృతి

Vitamin C: విటమిన్ సి తో చర్మం కాంతివంతం.. సమ్మర్‌లో ఇలా చేయండి..!

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.