Car Price: కొత్త ఏడాదిలో కార్లు మరింత ప్రియం.. కొనాలంటే ఇదే బెస్ట్‌ టైం.. ఈ నెలాఖరులోపే..

కాల గమనంలో మరో ఏడాది గడిచిపోయింది. మరికొన్ని రోజుల్లో క్యాలెండర్ మారిపోద్ది. అంతేకాదు చాలా విషయాలు మార్పులు వస్తాయి. కొన్ని ధరలు పెరుగుతాయి. మరికొన్ని ధరలు తగ్గుతాయి. వాటిల్లో ప్రధానంగా కార్ల ధరల విషయంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇదే విషయాన్ని కొన్ని ప్రసిద్ధ కార్ల కంపెనీలు ధ్రువీకరించాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Car Price: కొత్త ఏడాదిలో కార్లు మరింత ప్రియం.. కొనాలంటే ఇదే బెస్ట్‌ టైం.. ఈ నెలాఖరులోపే..
Cars
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Dec 14, 2023 | 1:50 PM

కాల గమనంలో మరో ఏడాది గడిచిపోయింది. మరికొన్ని రోజుల్లో క్యాలెండర్ మారిపోద్ది. అంతేకాదు చాలా విషయాలు మార్పులు వస్తాయి. కొన్ని ధరలు పెరుగుతాయి. మరికొన్ని ధరలు తగ్గుతాయి. వాటిల్లో ప్రధానంగా కార్ల ధరల విషయంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇదే విషయాన్ని కొన్ని ప్రసిద్ధ కార్ల కంపెనీలు ధ్రువీకరించాయి. ముఖ్యంగా మారుతీ సుజుకీ, హ్యూందాయ్, టాటా, మహీంద్రా, ఆడి వంటి బ్రాండ్లు 2024 జనవరి నుంచి ధరలు పెరుగుతాయని ప్రకటించాయి. ఆ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

మారుతీ సుజుకీ..

మన దేశంలో అతి పెద్ద కార్ల విక్రయదారు మారుతి సుజుకీ. ఈ బ్రాండ్‌ నుంచి అత్యధికంగా కార్ల విక్రయాలు జరుగుతుంటాయి. ఈ కంపెనీకి చెందిన అరెనా, నెక్సా కార్ల ధరలు 2023 చివరిలో పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ ప్రకటించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు మోటార్ల తయారీలో ఉపయోగించే పదార్థాల ధరలు పెరగడం వల్ల ఇన్‌పుట్ ఖర్చు పెరిగిందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఏ కారు ఎంత మేర ధర పెరిగిందనే విషయంలో క్లారిటీ లేదు. మారుతి కార్ల కొత్త ధరలు 2024 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

హ్యూందాయ్‌..

మన దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ కూడా కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, రూపాయితో డాలర్ విలువ పెరగడం, కొన్ని వస్తువుల ధరలు పెరగడం వంటి కారణాల వల్ల కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. కొత్త ధరలు 2024 జనవరి నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియా లైనప్ 13 మోడళ్లను కలిగి ఉంది. వీటిల్లో కోనా ఈవీ, ఐయనిక్‌ ఈవీ వాహనాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

టాటా కార్స్‌..

టాటా గ్రూప్‌కు చెందిన ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టాటా మోటార్స్ కూడా జనవరి 2024 నుంచి కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. టాటా ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్), ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) సహా అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఏయే మోడళ్ల ధరలు ఎంత మేరకు పెరుగుతాయో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లైన్ అప్ ప్రస్తుతం 10 మోడళ్లను కలిగి ఉంది. వీటిలో 3 ఈవీలు కూడా ఉన్నాయి. అవి టాటా టియాగో ఈవీ, టాటా టైగోర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ.

టాటా కమర్షియల్ వెహికల్..

ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలను తయారు చేసే టాటా మోటార్స్ విభాగం కూడా కొత్త సంవత్సరంలో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచబోతున్నట్లు కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు 2024, జనవరి 1నుంచి అమలులోకి వస్తాయి. వాణిజ్య వాహనాల ధరలను మూడు శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

మహీంద్రా కార్స్‌..

దేశీయ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కూడా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటిలో మహీంద్రా యొక్క ఆల్-ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ400 ఈవీ కూడా ఉంది. ప్రస్తుతం, మహీంద్రా దేశంలో 8 ఎస్‌యూవీలు, 1ఎంపీవీని రిటైల్ చేస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 అత్యంత సరసమైన మహీంద్రా ఎస్‌యూవీగా ఉంది. దీని ధరలు రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

హోండా కంపెనీ..

కార్ల తయారీ కంపెనీ హోండా కూడా తన కొన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటిలో ఇటీవల విడుదల చేసిన హోండా ఎలివేట్ కూడా ఉంది. అయితే, ఒక్కో మోడల్‌కు నిర్దిష్ట ధర పెరుగుదల వివరాలు తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

ఆడి..

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కూడా 2024 జనవరి నుంచి తమ అన్ని కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. దేశంలో ఆడి మొత్తం 15 మోడళ్లను విక్రయిస్తోంది, వాటిలో 4 ఈవీలు. ఆడి ఏ4 మార్కెట్లో అత్యంత సరసమైనవి. దీని ధర రూ. 43.85 లక్షలు. ఆడి ఆర్‌ఎస్‌ క్యూ8 భారతదేశంలో దాని ఫ్లాగ్‌షిప్ మోడల్, దీని ధర రూ. 2.22 కోట్లు. ఇవేకాక మరికొన్ని టాప్‌ కంపెనీలు కూడా ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో రెనాల్ట్, నిస్సాన్, కియా, జీప్ ఉన్నాయి. అయితే, ఈ కార్ల తయారీదారులు ధరల పెంపుపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..