మీ ఇంటిని, స్థలాన్ని అద్దెకు ఇస్తూ ఈ పొరపాట్లు చేయకండి.. స్వాధీనం చేసుకుంటారు?

అద్దె తీసుకున్న వ్యక్తి ఇంటిని గానీ, ప్లాట్‌నుగానీ స్వాధీనం చేసుకున్నాడనే వార్తలు అప్పుడప్పునడు వింటుంటాము. ఇంటి యజమానులు తమ ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకపోతే కొన్ని పొరపాట్ల కారణంగా అద్దెదారు ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చు. ఆ తప్పులు ఏమిటో తెలుసుకుందాం.. తరచుగా, అద్దె ఒప్పందాన్ని చేసేటప్పుడు భూస్వాములు కొన్ని విషయాలపై శ్రద్ధ చూపడంలో విఫలమవుతారు. యజమాని మొదట..

మీ ఇంటిని, స్థలాన్ని అద్దెకు ఇస్తూ ఈ పొరపాట్లు చేయకండి.. స్వాధీనం చేసుకుంటారు?
Landlord Tenant Agreement Rules
Follow us
Subhash Goud

|

Updated on: Dec 14, 2023 | 5:11 PM

చాలా మంది ప్రజలు తమ నగరాన్ని విడిచిపెట్టి ఇతర నగరాలకు పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఇల్లు కొనడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అద్దెకు ఇల్లు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. దీని కారణంగా పెద్ద నగరాల్లో అద్దెదారుల సంఖ్య పెరుగుతోంది. ఇంటిని అద్దెకు తీసుకోవడానికి, అద్దెదారు, యజమాని మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది. ఇల్లు, దాని సంబంధిత నిబంధనలు, షరతులను కలిగి ఉంటుంది. కానీ, కొందరు యజమానులు అద్దెకు తీసుకున్న వ్యక్తి ఇంటిని గానీ, ప్లాట్‌నుగానీ స్వాధీనం చేసుకుంటాడేమోనని భయపడుతుంటారు.

అద్దె తీసుకున్న వ్యక్తి ఇంటిని గానీ, ప్లాట్‌నుగానీ స్వాధీనం చేసుకున్నాడనే వార్తలు అప్పుడప్పునడు వింటుంటాము. ఇంటి యజమానులు తమ ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకపోతే కొన్ని పొరపాట్ల కారణంగా అద్దెదారు ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చు. ఆ తప్పులు ఏమిటో తెలుసుకుందాం..

తరచుగా, అద్దె ఒప్పందాన్ని చేసేటప్పుడు భూస్వాములు కొన్ని విషయాలపై శ్రద్ధ చూపడంలో విఫలమవుతారు. యజమాని మొదట అద్దెదారున్ని పోలీసు ధృవీకరణ చేయాలి. ఆపై అద్దె ఒప్పందంలో అతని నిబంధనలను రాయాలి. సాధారణంగా 11 నెలలకు అద్దె ఒప్పందం చేసుకోవడం మంచిది. ఎవరైనా ఎక్కువ కాలం అద్దె స్థలంలో ఉంటే కొన్ని నిబంధనల ప్రకారం ఆ ఆస్తి వారిదే అవుతుంది. అప్పుడు కోర్టు కూడా ఈ విషయంలో ఏమీ చేయదు. అద్దెదారు 12 సంవత్సరాల పాటు ఒక స్థలంలో ఉంటే, అతను దానిపై తన యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేసుకోవచ్చని కూడా గతంలో సుప్రీంకోర్టు పేర్కొంది. బ్రిటీష్ కాలం నుంచి ఈ స్వాధీనం నియమం ఆచరణలో ఉంది. కానీ, కొన్ని పరిస్థితుల్లో ఈ నియమం చెల్లుబాటు కాదు. ఇలా ప్రభుత్వ భూముల్లో ఈ నిబంధన చెల్లదు. అంటే ఎవరైనా ప్రభుత్వ ఫ్లాట్‌లో నివసిస్తుంటే అతను ఈ ఇంటిని స్వాధీనం చేసుకోలేడు.

మీరు యజమాని అయితే, మీ ఆస్తిని పోగొట్టుకోకూడదనుకుంటే, ముందుగా మీరు ఎవరికైనా అద్దెకు ఇచ్చే సమయంలో ఒప్పందం చేసుకోవాలి. మీరు దీన్ని 11 నెలలు మాత్రమే చేయాలి. ఆ తర్వాత మీరు దానిని పొడిగించాలనుకుంటే 1మరో 1 నెలల పాటు మళ్లీ పొడిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఆస్తిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. మీరు కోరుకుంటే ఒక సంవత్సరం తర్వాత మీ అద్దెదారున్ని కూడా మార్చవచ్చు. మీరు మీ ఆస్తిని ఎప్పటికప్పుడు సందర్శిస్తూ ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి