Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tesla Car Recall: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కీలక నిర్ణయం.. 2 మిలియన్లకు పైగా కార్ల రీకాల్

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు గట్టి షాక్ తగిలింది. అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని కార్లను రీకాల్‌ చేసింది. యూఎస్ ఆటో సేఫ్టీ రెగ్యులేటర్ల ద్వారా రెండు సంవత్సరాల పరిశోధన అనంతరం ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా తన వాహనాలను 2 మిలియన్లకు పైగా రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది.

Tesla Car Recall: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కీలక నిర్ణయం.. 2 మిలియన్లకు పైగా కార్ల రీకాల్
Tesla Car
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 14, 2023 | 1:41 PM

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు గట్టి షాక్ తగిలింది. అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని కార్లను రీకాల్‌ చేసింది. యూఎస్ ఆటో సేఫ్టీ రెగ్యులేటర్ల ద్వారా రెండు సంవత్సరాల పరిశోధన అనంతరం ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా తన వాహనాలను 2 మిలియన్లకు పైగా రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది. ఆటోపైలట్ మోడ్‌కు సంబంధించిన ప్రమాదాలు దీనికి కారణం. ఈ రీకాల్ మొత్తం లైనప్‌కు వర్తిస్తుంది. ఆటోపైలట్‌ విధానాన్ని ఉపయోగించేటప్పుడు డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని సరి చేసేందుకు, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

దాదాపు 20 లక్షల పైచిలుకు కార్లను రీకాల్ చేసింది. 2012 అక్టోబర్‌ 5 మొదలు ఈ ఏడాది డిసెంబర్‌ వరకు ఉత్పత్తి చేసిన వై, ఎస్, 3, ఎక్స్‌ మోడల్స్‌ వీటిలో ఉన్నాయి. 2015 చివరిలో ఆటోపైలట్ ప్రవేశపెట్టినప్పటి నుండి అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని టెస్లా కార్లను రీకాల్ చేస్తుంది. భద్రతా నియంత్రకాలు అందించిన సమాచారం ప్రకారం, ఆటోపైలట్ మోడ్‌తో కనుగొనబడిన సమస్యలను పరిష్కరించడానికి టెస్లా సాఫ్ట్‌వేర్ అధునీకరించేందుకు రీకాల్ చేసినట్లు సంస్థ తెలిపింది. నేషనల్ హైవే సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, విచారణలో డ్రైవర్ చురుకుదనాన్ని పర్యవేక్షించే ఆటోపైలట్ సామర్థ్యంలో లోపాలు బయటపడ్డాయి. ఇది సరిపోదని, ఈ ఫీచర్ దుర్వినియోగం అవుతుందనే ఆందోళనలకు దారితీసింది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో అదనపు నియంత్రణలు కూడా చేర్చడం జరిగింది. తన డ్రైవింగ్ బాధ్యతలను అనుసరించమని డ్రైవర్‌ను ఎవరు ప్రోత్సహిస్తూనే ఉంటారు. కొన్ని కార్లకు సంబంధించిన అప్‌డేట్ మంగళవారం నాడు పంపిచడం జరిగింది. మిగిలినవి కూడా త్వరలో పంపించడం జరుగుతుందని సంస్థ తెలిపింది.

ఆటోపైలట్ స్వయంచాలకంగా స్టీరింగ్‌ను నిర్వహించగలదు. వేగాన్ని పెంచుతుంది. దాని లేన్‌లో బ్రేక్‌లను కూడా స్వతహాగా వేసుకుంటుంది. కానీ ఇక్కడ డ్రైవర్‌కు సహాయం చేయడానికి ఆటోపైలట్ మోడ్ పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం రీకాల్ చేసిన కార్లలో ఇది పూర్తిగా కారును నడపగల సామర్థ్యం లేదు. డ్రైవర్లు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం లేదా వెనుక సీటుపై కూర్చొని వాహనాలు నడుపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌లో టెస్లా 54,676 యూనిట్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఈ లోపాన్ని పరిష్కరించడానికి, కంపెనీ ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..