Aadhaar Services: ఆధార్ సర్వీస్ సెంటర్లకు హెచ్చరిక.. అధికంగా వసూలు చేస్తే ఫైన్ పడుద్ది జాగ్రత్త! 

ఆధార్ సర్వీసులకు ఫీజు నిర్ధేశిత మొత్తం కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయం తమ దృష్టికి వస్తే ఆపరేటర్ ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్ కు రూ. 50వేల జరిమానా విధిస్తామని చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Aadhaar Services: ఆధార్ సర్వీస్ సెంటర్లకు హెచ్చరిక.. అధికంగా వసూలు చేస్తే ఫైన్ పడుద్ది జాగ్రత్త! 
Aadhaar Free Update
Follow us
Madhu

|

Updated on: Dec 15, 2023 | 12:16 PM

ప్రతి భారతీయ పౌరుడికి గుర్తింపు ఆధార్ కార్డు. ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. దీనిలో ఉండే వ్యక్తుల ప్రాథమిక సమాచారం ఆధారంగానే అన్ని ప్రభుత్వ పథకాలు పొందుకోగలరు. సాధారణంగా ఆధార్ కార్డులో వ్యక్తుల పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, చిరునామా ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా ఉండాలి. ఏమాత్రం తేడా ఉన్నా సరిచేసుకోవాలి. అలాగే గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఆధార్ కార్డులోని వివరాలు అప్ డేట్ చేసుకోకపోతే.. ప్రస్తుతం ఒకసారి కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆధార్ కార్డులను నిర్వహించే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కూడా ఇదే విషయాన్ని కార్డుదారులకు తెలియజేస్తోంది. ఇది తప్పనిసరిగా కాకపోయిన ఓ సారి ఆధార్ అప్ డేట్ చేసుకోవడం మంచిదని సూచిస్తోంది. పైగా వచ్చే ఏడాది మార్చి 14 వరకూ ఆధార్ అప్ డేట్ ఏదైనా ఉచితంగా చేసుకొనే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత మాత్రం ప్రతి సర్వీస్ కి కొంత చార్జీ వసూలు చేస్తారు. అయితే అది నిర్ధేశిత మొత్తంలోనే ఉంటుంది. అంతకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

సర్వీస్ చార్జీలు అధికంగా వసూలు చేస్తే ఫైన్..

ఆధార్ సర్వీసులకు నిర్ధేశిత మొత్తం కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయం తమ దృష్టికి వస్తే ఆపరేటర్ ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్ కు రూ. 50వేల జరిమానా విధిస్తామని చెప్పింది. లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై కార్డుదారులు ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. అందుకోసం యూఐడీఏఐ కి మెయిల్ ద్వారా గానీ లేదా 1947 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని ఆయన వివరించారు.

ఆధార్ అప్ డేట్ అవసరమా?

ప్రస్తుతం పుట్టిన వెంటనే ఆధార్ కార్డు కోసం అందరూ దరఖాస్తు చేస్తున్నారు. అయితే కొంత కాలం క్రితం ఆ పరిస్థితి లేదు. ఎప్పుడో ఆధార్ క్యాంపులో కార్డు తీసుకున్నారనుకోండి. ఈ మధ్యలో మీరు ఊరు మారినా, ప్రాంతం మారినా అప్పుడు మీరు కార్డులో అడ్రస్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో అడ్రస్ ఆధారంగానే పాన్ కార్డు, ఆధార్, పాస్ పోర్ట్ వంటి అనేక డాక్యుమెంట్లు మంజూరు అవుతాయి. అలాగే కార్డు తీసుకునే సమయంలో మీరు మీ ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ వంటివి ఇస్తారు. ఎక్కువ ఏళ్లు గడిచిపోతే అవి సరిగా తీసుకోవు. అందుకే కనీసం పదేళ్లకు ఒకసారైనా డెమోగ్రాఫిక్స్((పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్) అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. దీని వల్ల కార్డుదారులకు ప్రయోజనం చేకూరుతుంది.

ఇవి కూడా చదవండి

ఎలా అప్ డేట్ చేసుకోవాలంటే..

ఆధార్ కార్డులోని డెమెగ్రాఫిక్ వివరాలు ఆన్ లైన్ లోనే అప్ డేట్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు మై ఆధార్(https://myaadhaar.uidai.gov.in/) పోర్టల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆధార్ కార్డుకు సంబంధించి ఏదైనా అనుమానం/సందేహాలు ఉంటే 1947 నంబర్‌కు కాల్ చేయొచ్చు. ఇది టోల్ ఫ్రీ నంబర్. దాదాపు అన్ని భాషల్లో వినియోగదదరులకు కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. లేదా help@uidai.gov.in కు మెయిల్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!