AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Har ghar lakhpati: ఈ పథకంలో చేరితే మూడేళ్లలో లక్షాధికారే.. ఎస్‌బీఐలో అమలవుతున్నసూపర్ స్కీమ్

జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరం. సంపాదించిన ఆదాయంలో కొంత పొదుపు చేసి, దాన్ని పెట్టుబడిగా పెట్టడం ద్వారా మరింత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. దీని కోసం అనేక మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర అధిక రాబడి ఇచ్చేవి చాలా కనిపిస్తాయి. కానీ వీటిలో పెట్టుబడులకు కొంచెం రిస్కు కూడా ఉంటుంది. కాబట్టి రిస్కు లేకుండా, పరిమితి ఆదాయం కోరుకునేవారికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో మంచి ఆర్డీ పథకం ఉంది. దీనిలో ప్రతినెలా డబ్బులను జమ చేయడం ద్వారా నిర్ణీత కాలానికి మంచి ఆదాయం పొందవచ్చు.

Har ghar lakhpati: ఈ పథకంలో చేరితే మూడేళ్లలో లక్షాధికారే.. ఎస్‌బీఐలో అమలవుతున్నసూపర్ స్కీమ్
Sbi Lakhpati Scheme
Nikhil
|

Updated on: Jan 15, 2025 | 4:30 PM

Share

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకులో హర్ ఘర్ లఖ్ పతి అనే ఆర్డీ పథకం అమలవుతోంది. చిన్న మొత్తంలో ప్రతినెలా డిపాజిట్ చేయడం ద్వారా రూ.లక్ష, అంతకంటే ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. నిర్ణీత కాలానికి హామీ ఇచ్చిన మొత్తం పొందగలిగే అవకాశం లభిస్తుంది. రిస్కు లేకుండా క్రమబద్దమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ పథకంలో మూడు, నాలుగేళ్ల డిపాజిట్లకు 6.75, అంతకు మించితే 6.50 శాతం వడ్డీ అందిస్తారు. వరుసగా ఆరు నెలల పాటు డబ్బులను ఇన్వెస్ట్ చేయకపోతే ఖాతా మూసివేస్తారు. అప్పటి వరకూ కట్టిన డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. సాధారణ ఖాతాదారులకు, సీనియర్ సిటిజన్లకు వేర్వేరుగా వడ్డీరేట్లు అమలవుతాయి.

సాధారణ ఖాతాదారులైతే..

  • హర్ ఘర్ లాఖ్ పతి అనే ఈ ఆర్డీలో చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ఖాతాదారులు చేేసే డిపాజిట్ కు 6.75 శాతం వడ్డీరేటు అందిస్తారు. నెలకు రూ.2500 చొప్పున మూడు సంవత్సరాలు పెట్టుబడి పెట్టడం ద్వారా నిర్ణీత సమయానికి రూ.లక్షవరకూ పొందవచ్చు.
  • ఐదేళ్ల పాటు ప్రతినెలా 1,407 చొప్పున కడితే 6.50 వడ్డీరేటుతో రూ.లక్ష పొందవచ్చు.
  • నాలుగేళ్ల పాటు ప్రతినెలా రూ.1,810 చొప్పున కడితే 6.75 వడ్డీరేటుతో లక్ష రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

సీనియర్ సిటిజన్లకు..

  • సీనియర్ సిటిజన్లు మూడేళ్ల పాటు నెలకు రూ.2,480 చొప్పున చెల్లిస్తే 7.25 వడ్డీరేటుతో రూ.లక్ష పొందుతారు.
  • ప్రతి నెలా 1,791 చొప్పున నాలుగేళ్ల పాటు చెల్లిస్తే 7.25 శాతం వడ్డీరేటుతో రూ.లక్ష అందిస్తారు.
  • ప్రతి నెలా రూ.1,389 చొప్పున ఐదేళ్ల పాటు డబ్బులు కడితే ఏడు శాతం వడ్డీరేటుతో రూ.లక్ష అందుతాయి.

నిర్ణీత సమయానికి స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఎస్బీఐ లఖ్ పతి ఆర్డీ పథకం అనువుగా ఉంటుంది. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా నిర్ణీత కాలవ్యవధికి డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. చిన్న మొత్తాలతో చేసే ఈ పొదుపులు పిల్లల చదువులు తదితర అత్యవసర అవసరాలకు ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి