Credit cards: నిబంధనలు తెలియకపోతే జేబుకు చిల్లే… ఆ క్రెడిట్ కార్డుల రూల్స్ మార్పు

క్రెడిట్ కార్డుల వినియోగం నేడు విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరా తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. వివిధ బ్యాంకులు తమ ఖాతాదారులకు పోటీపడి మరీ వీటిని అందజేస్తున్నాయి. దీనిలో భాగంగా వివిధ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఈ రోజుల్లో షాపింగ్ చేయాలన్నా, టిక్కెట్లు బుక్ చేయాలన్నా, టూర్ కు వెళ్లాలన్నా చేతిలో డబ్బులు అవసరం లేదు. కేవలం క్రెడిట్ కార్డు ఉంటే చాలు. వివిధ అవసరాలను తీర్చడంతో పాటు అత్యవసర సమయంలో ఈ కార్డు ఆదుకుంటుంది.

Credit cards: నిబంధనలు తెలియకపోతే జేబుకు చిల్లే… ఆ క్రెడిట్ కార్డుల రూల్స్ మార్పు
Credit Cards
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 16, 2024 | 10:00 PM

క్రెడిట్ కార్డుల వినియోగం నేడు విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరా తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. వివిధ బ్యాంకులు తమ ఖాతాదారులకు పోటీపడి మరీ వీటిని అందజేస్తున్నాయి. దీనిలో భాగంగా వివిధ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఈ రోజుల్లో షాపింగ్ చేయాలన్నా, టిక్కెట్లు బుక్ చేయాలన్నా, టూర్ కు వెళ్లాలన్నా చేతిలో డబ్బులు అవసరం లేదు. కేవలం క్రెడిట్ కార్డు ఉంటే చాలు. వివిధ అవసరాలను తీర్చడంతో పాటు అత్యవసర సమయంలో ఈ కార్డు ఆదుకుంటుంది. అయితే ఇటీవల క్రెడిట్ కార్డుల నియమాలను ఆయా బ్యాంకులు మార్చాయి. వాటిని తెలుసుకోకపోతే జేబుకు చిల్లు పడడం ఖాయం. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుల క్రెడిట్ కార్డుల నిబంధనలను తెలుసుకుందాం.

ఐసీఐసీఐ

ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐ తన క్రెడిట్ కార్డుల నిబంధనలను మార్పు చేసింది. ఖాతాదారులకు వివిధ ప్రయోజనాలను తగ్గించింది. సవరించిన రేట్లు ఈ ఏడాది నవంబరు 15 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ లావాదేవీలపై ఎలాంటి రివార్డులు ఉండవు. ఇంధనపై సర్ చార్చి మినహాయింపును నెలకు రూ.ఒక లక్షకు పరిమితం చేశారు. దీనికి మించితే సర్ చార్జి వర్తించదు. అలాగే స్పా యాక్సెస్ కోసం అందించిన డ్రీమ్ ఫోక్స్ కార్డును ఆపివేశారు. నెలకు రూ.50 వేలకు మించి యుటిలిటీ లావాదేవీలు చేస్తే ఒక శాతం ఫీజు విధిస్తారు. రూ.పదివేల ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ విలువ దాటినా ఇంతే చెల్లించాలి.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా

ఎస్బీఐ తన కొన్ని క్రెడిట్ కార్డులకు లావాదేవీల రుసుములను పెంచింది. అన్ని కార్డులపై ఫైనాన్స్ చార్జీలను 3.75 శాతానికి పెంచింది. కానీ ఇవి శౌర్, డిఫెన్స్ కు వర్తించవు. ఈ నిబంధన నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది. ప్రస్తుతం ఈ రేటు 3.50 శాతంగా ఉంది. అలాగే యుటిలీటీ చెల్లింపులు రూ.50 వేలు దాటితే ఒక శాతం చార్జి వసూలు చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ఈ నిబంధన అమలు చేయనున్నారు. టెలిఫోన్, మొబైల్, విద్యుత్ బిల్లులు, బీమా ప్రీమియాలను యూటిలిటీ బిల్లులు అంటారు.

హెచ్‌డీఎఫ్‌సీ

నిర్థిష్ట క్రెడిట్ కార్డుల కోసం ఈ బ్యాంకు లాయల్టీ ప్రోగ్రామ్ ను అప్ డేట్ చేసింది. కొన్ని నిబంధనలను సవరించింది. అవి అక్టోబర్ ఒకటి నుంచి అమలవుతున్నాయి. ఈ మార్పులపై తమ ఖాతాదారులకు ఇమెయిల్ పంపింది. స్మార్ట్ బై ప్లాట్ ఫాంలో ప్రతి కేలండర్ త్రైమాసికంలో ఆపిల్ ఉత్పత్తులకు పొందే రివార్డు పాయింట్ల రీడిమ్ ను పరిమితం చేసింది. దీని వల్ల ప్రతి త్రైమాసికానికి ఒక సారి మాత్రమే చేసుకునే వీలుంటుంది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. అలాగే తనిష్క్ వోచర్ల కోసం రివార్డు పాయింట్ల రీడిమ్ ను ప్రతి త్రైమాసికానికి 50 వేల పాయింట్లకు మాత్రమే పరిమితం చేశారు.