Medicines Price: ఈ మందుల ధరలు ఖరీదైనవి.. ఏయే మెడిసిన్‌ రేట్లు పెరిగాయంటే..!

ఈ రోజుల్లో నిత్యావసర సరుకులలాగే మందుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. వివిధ రకాల వ్యాధులకు వాడే మెడిసిన్‌ ధరలు సైతం పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులకు సైతం భారం కానుంది. ఇప్పటికే చాలా రకాల మందుల ధరలు పెరుగగా, ఇప్పుడు మరికొన్ని మందులు ధరలు పెరిగాయి..

Medicines Price: ఈ మందుల ధరలు ఖరీదైనవి.. ఏయే మెడిసిన్‌ రేట్లు పెరిగాయంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 16, 2024 | 11:39 PM

నేషనల్ డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ ఎనిమిది ఔషధాల తయారీ రేట్లను యాభై శాతానికి పెంచింది. ఈ ఔషధాల తయారీ వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ సమావేశం తర్వాత ఈ మందుల ఫార్ములేషన్స్ ధరలను పెంచాలని నిర్ణయించింది.

ఫార్మాస్యూటికల్ కంపెనీలు నష్టపోతున్నాయి:

ఈ ఔషధాల గరిష్ట ధరలు చాలా తక్కువగా ఉండటం వల్ల కంపెనీలు బడ్జెట్‌లో ఈ మందులను తయారు చేసి మార్కెట్ చేయలేకపోయాయి. దీంతో కొన్ని కంపెనీలు ఈ మందులను మార్కెటింగ్ చేయకుండా నిలిపివేశాయి. ఆ తర్వాత కొన్ని కంపెనీలు మార్కెటింగ్‌ను ఆపవద్దని ఎన్‌పిపిఎ కూడా అభ్యర్థించింది. ఎందుకంటే మందులు చాలా ముఖ్యమైనవి. ఇది ఈ మందుల సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపింది. రోగులతో పాటు వైద్యులు కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది

మందుల రేట్లు పెరిగాయి:

గ్లాకోమా, ఉబ్బసం, టీబీ, తలసేమియా, మానసిక ఆరోగ్యానికి ఉపయోగించే మందులు ఎన్‌పీపీఏ పెంచిన రేట్లే ఉంటాయి. పెరిగిన రేట్లు ఉన్న ఈ ఔషధాలలో బెంజైల్ పెన్సిలిన్ 10 లక్షల IU ఇంజెక్షన్ కూడా ఉంది. సాల్బుటమాల్ మాత్రలు 2 mg, 4 mg, రెస్పిరేటర్ ద్రావణం 5 mg/ml చేర్చారు. ఈ మందులు మొదటి వరుస చికిత్సగా ఉపయోగిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి