AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swift Dzire: మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో

ప్రుఖ ఆటోమొబైల్‌ సంస్థ మారుతి సుజుకీ కొత్త కారును లాంచ్‌ చేసేందుకు సిద్దమవుతోంది. మారుతిలో విజయవంతమైన స్విఫ్ట్‌ డిజైర్‌ నుంచి కొత్త వేరియంట్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎలాంటి ప్రత్యేకతలతో ఈ కారు లాంచ్‌ కానుంది లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Swift Dzire: మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో
Swift Dezire 2024
Narender Vaitla
|

Updated on: Oct 17, 2024 | 7:57 AM

Share

భారత్‌లో మారుతి బ్రాండ్‌కు ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారుతి నుంచి స్విఫ్ట్‌కు మరింత ఎక్కువ పాపులారిటీ ఉంది. దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే కార్లలో ఒకటిగా స్విఫ్ట్ నిలిచింది. ముఖ్యంగా స్విఫ్ట్ డిజైర్‌ కారుకు భారీ డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు డిజైర్‌ నుంచి వచ్చిన అన్ని వేరియంట్స్‌ భారీగా అమ్మకాలు జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా స్విఫ్ట్‌ డిజైర్‌ నుంచి కొత్త వేరియంట్ వస్తోంది.

అక్టోబర్ 3వ వారంలో మారుతీ సుజుకీ డిజైర్‌ కొత్త వేరియంట్‌ వస్తోంది. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త డిజైర్‌లో లాంటి ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్రోమ్ ఫినిషింగ్​తో వచ్చే మల్టిపుల్ హారిజాంటల్ స్లాట్స్​తో కూడిన భారీ గ్రిల్, డీఆర్​ఎల్​లతో కూడిన కొత్త ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్, ఫాగ్ లైట్స్‌ ఇందులో ఉండనున్నాయి. కొత్త అలాయ్‌ వీల్స్‌తో ఈ కారును తీసుకొస్తున్నారు.

ముఖ్యంగా మారుతీ సుజుకీ డిజైర్‌ ఇంటీరియర్‌లో భారీగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబిన్‌లో గణనీయైన మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 360-డిగ్రీల కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్‌ను ఇందులో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్పోర్టీ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్‌తో కూడిన ఈ కారులో పుడిల్ ల్యాంప్స్, హెడ్-అప్ డిస్ప్లే, స్టైలిష్ డ్యూయెల్-టోన్ బీజ్, బ్లాక్ ఇంటీరియర్ డిజైన్ వంటి ఫీచర్లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇంజన్‌ విషయానికొస్తే 1.2-లీటర్, 3 సిలిండర్​ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారును తీసుకొస్తున్నారు. 80బీహెచ్​పీ పవర్​, 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది 5-స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ ఆప్షన్స్ ఇందులో ఇవ్వనున్నారు. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ కారుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..