ICICI Bank: ఎఫ్డీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్..

ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ(ICICI Bank) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పైబడిన వివిధ కాలాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ల(fixed deposit)పై వడ్డీ రేట్లను 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది...

ICICI Bank: ఎఫ్డీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 22, 2022 | 5:19 PM

ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ(ICICI Bank) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పైబడిన వివిధ కాలాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ల(fixed deposit)పై వడ్డీ రేట్లను 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు 22 మార్చి 2022 నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఐసీఐసీఐ ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలవ్యవధితో FDలపై వడ్డీ రేట్లను పెంచింది. మిగిలిన FDల రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఒక సంవత్సరం నుంచి 389 రోజులు, 390 రోజుల నుంచి 15 నెలల కంటే తక్కువ FDలపై, సాధారణ, సీనియర్ సిటిజన్లు 4.15 శాతం వడ్డీని పొందుతారు. ఇంతకు ముందు ఈ FDలపై వడ్డీ రేటు 4.05 శాతంగా ఉండేది. ఇది కాకుండా, 15 నెలల నుంచి 18 నెలల లోపు కాలపరిమితి కలిగిన FDలపై బ్యాంక్ 4.20 శాతం వడ్డీని ఇస్తుంది. ఇంతకుముందు ఈ FDలపై 4.10 శాతం వడ్డీని చెల్లించేది. ఈ కాలపరిమితిపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచారు. ICICI బ్యాంక్ 18 నెలల కంటే ఎక్కువ, 2 సంవత్సరాల కంటే తక్కువ FDలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచి 4.30 శాతానికి పెంచింది. ఇంతకు ముందు ఈ కాలానికి వడ్డీ రేటు 4.25 శాతంగా ఉండేది.

మిగిలిన FDల రేట్లలో బ్యాంక్ ఎలాంటి మార్పు చేయలేదు. ICICI బ్యాంక్ 3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు FDలపై 4.6 శాతం రేటును కొనసాగిస్తోంది. 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.70 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. అంతేకాకుండా 185 రోజుల నుంచి 270 రోజుల మధ్య కాలవ్యవధిపై వడ్డీ రేటు 3.6 శాతం కాగా, 91 రోజుల నుంచి 184 రోజుల కాలవ్యవధిపై వడ్డీ రేటు 3.35 శాతంగా ఉంది. 61 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉన్న FDలపై వడ్డీ రేటు 3 శాతంగా కొనసాగుతోంది. ఈ సవరించిన వడ్డీ రేట్లు తాజా డిపాజిట్లు, ఇప్పటికే ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల పునరుద్ధరణకు వర్తిస్తాయి. ఈ నెల ప్రారంభంలో, ICICI బ్యాంక్ బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను పెంచింది. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 2 కోట్ల కంటే ఎక్కువ, రూ. 5 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అత్యధిక FD రేటు 4.6 శాతంగా ఉంది.

ఐసీఐసీఐతోపాటు మరో ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది11 రోజులు ఆపైన, ఏడాది 25 రోజు లోపు కాలపరిమితి ఉన్న ఎఫ్డీలపై మాత్రమే వడ్డీరేటు పెంచగా.. గతంలో 5.25శాతంగా ఉన్న వడ్డీని 5.30శాతానికి పెంచింది. మార్చి 21 నుంచే ఈ పెంపు వర్తిస్తుండగా.. మిగతా కాలపరిమితులకు ఇంతకు ముందున్న వడ్డీ రేట్లే వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొంది. SBI FD రేటును కూడా పెంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోలీకి ముందు దేశీయ బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.50 శాతం వరకు పెంచింది. బల్క్ డిపాజిట్ అనేది రూ. 2 కోట్లు, అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని సూచిస్తుంది. బ్యాంక్ కొత్త రేట్లు 10 మార్చి 2022 నుండి అమలులోకి వచ్చాయి.

Read Also.. Tata Motors: ఆ వాహనాల ధరలు పెంచనున్న టాటా మోటార్స్.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు..

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్