FD Rates Hike: ICICI బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు.. కొత్త రేట్స్ ఇవే..!

FD Rates Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడవసారి రెపో రేటు ను పెంచడంతో దాని ప్రభావం బ్యాంకు డిపాజిట్స్, లోన్స్‌పై చూపనుంది.

FD Rates Hike: ICICI బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు.. కొత్త రేట్స్ ఇవే..!
Icici
Follow us

|

Updated on: Aug 09, 2022 | 1:20 PM

FD Rates Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడవసారి రెపో రేటు ను పెంచడంతో దాని ప్రభావం బ్యాంకు డిపాజిట్స్, లోన్స్‌పై చూపనుంది. ఆర్‌బిఐ తాజా నిర్ణయం నేపథ్యంలో.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. 2 నుంచి 5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లలో బ్యాంక్ భారీ మార్పులు చేసింది. రెపో రేటు పెరిగిన నేపథ్యంలో బ్యాంకు ఎఫ్‌డీ రేట్లను పెంచింది. పెంచిన రేట్లు ఆగస్టు 8, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి.

మూడోసారి రెపో రేటు పెరుగుదల..

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రెపో రేటును పెంచింది. గత నాలుగు నెలల్లో ఆర్బీఐ రెపో రేటును మొత్తం మూడు సార్లు పెంచింది. మొదటి రెండు సార్లు మొత్తం 90 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఈసారి 50 బేసిస్ పాయింట్లను పెంచింది. దాంతో ప్రస్తుతం రెపో రేటు 5.40 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి

రెపో రేటు ప్రభావం ఐసీఐసీఐపై..

ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో.. ఇప్పుడు అన్ని బ్యాంకులు, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు, ఆర్‌డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా ICICI బ్యాంక్ 7 రోజుల నుంచి 5 సంవత్సరాల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 2 నుంచి 5 కోట్ల రూపాయలకు 3.25 శాతం నుంచి 5.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

2 నుండి 5 కోట్ల వరకు FD కొత్త రేట్లు..

7 నుండి 14 రోజులు – 3.25% 15 నుండి 29 రోజులు – 3.25% 30 నుండి 45 రోజులు – 3.35% 46 నుండి 60 రోజులు – 3.65% 61 నుండి 90 రోజులు – 4.50% 91 నుండి 120 రోజులు – 5.00% 121 నుండి 150 రోజులు – 5.00% 151 నుండి 184 రోజులు – 4.75% 185 నుండి 210 రోజులు – 5.25% 211 నుండి 270 రోజులు – 5.25% 271 నుండి 289 రోజులు – 5.50% 290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ – 5.50% 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు – 5.75% 2 నుండి 3 సంవత్సరాలు – 5.75% 3 నుండి 5 సంవత్సరాలు – 5.75% 5 నుండి 10 సంవత్సరాలు – 5.75%

2 కోట్ల కంటే తక్కువ FD రేట్లు..

7 నుండి 14 రోజులు – 2.75% 15 నుండి 29 రోజులు – 2.75% 30 నుండి 45 రోజులు – 3.25% 46 నుండి 60 రోజులు – 3.25% 61 నుండి 90 రోజులు – 3.25% 91 నుండి 120 రోజులు – 3.75% 121 నుండి 150 రోజులు – 3.75% 151 నుండి 184 రోజులు – 3.75% 185 రోజుల నుండి 210 రోజులు – 4.65% 211 రోజుల నుండి 270 రోజులు – 4.65% 271 రోజుల నుండి 289 రోజులు – 4.65% 290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ – 4.65% 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు – 5.30% 2 నుండి 3 సంవత్సరాలు – 5.35% 3 నుండి 5 సంవత్సరాలు – 5.70% 5 నుండి 10 సంవత్సరాల వరకు FD లపై – 5.75%

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!