AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyundai Creta EV: రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు.. లాంచింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న హ్యూందాయ్..

హ్యూందాయ్ క్రెటా ఈవీ మన దేశంలోని రోడ్లపై పరీక్షిస్తున్న సమయంలో కెమెరాకు చిక్కింది. ఈ కారు మొత్తం పూర్తిగా కప్పి ఉంచడంతో దాని డిజైన్ గురించిన సమాచారం వెల్లడికాలేదు. అయితే చూడటానికి మాత్రం ఇప్పటికే ఉన్న క్రెటా ఫేస్ లిఫ్ట్ మాదిరిగానే ఉంది. స్టాండర్డ్ మోడల్ లాగే డిజైన్ ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రధాన మార్పులుకూడా కనిపిస్తాయని చెబుతున్నారు.

Hyundai Creta EV: రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు.. లాంచింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న హ్యూందాయ్..
Hyundai Creta Ev
Madhu
|

Updated on: Mar 19, 2024 | 6:54 AM

Share

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం హ్యూందాయ్ మోటార్స్ ఇండియా ఇటీవలె ఫేస్ లిఫ్టెడ్ హ్యూందాయ్ క్రెటా ను లాంచ్ చేసింది. క్రెటా ఎన్ లైన్ పేరుతో మన దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే మంచి సేల్స్ రాబడుతోంది. ఇప్పుడు మరో కొత్త ఉత్పత్తిని లాంచ్ చేసేందుకు సంస్థ రెడీ అయ్యింది. ఎలక్ట్రిక్ వేరియంట్ క్రెటా ఎస్‌యూవీని పరిచయం చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఈ కారును మన దేశీయ రోడ్లపై టెస్ట్ డ్రైవ్ కూడా చేపట్టింది. ఆ సమయంలో పలు మార్లు ఔత్సాహిక కెమెరాలకు సైతం చిక్కింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కొత్త క్రెటా ఈవీ ఎలా ఉంది..

హ్యూందాయ్ క్రెటా ఈవీ మన దేశంలోని రోడ్లపై పరీక్షిస్తున్న సమయంలో కెమెరాకు చిక్కింది. ఈ కారు మొత్తం పూర్తిగా కప్పి ఉంచడంతో దాని డిజైన్ గురించిన సమాచారం వెల్లడికాలేదు. అయితే చూడటానికి మాత్రం ఇప్పటికే ఉన్న క్రెటా ఫేస్ లిఫ్ట్ మాదిరిగానే ఉంది. స్టాండర్డ్ మోడల్ లాగే డిజైన్ ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రధాన మార్పులుకూడా కనిపిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా గ్రిల్, హ్యూందాయ్ లోగో, చార్జింగ్ పోర్ట్, వెనుకవైపు బంపర్స్ రీ డిజైన్ చేసి ఉంటుంది. అలాగే 17 అంగుళాల ఎరో డైనమికల్లీ డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

ఇక ఇంటీరియ్ విషయానికి వస్తే క్రెటా ఈవీలో కూడా దాదాపు స్టాండర్డ్ మోడల్ హ్యూందాయ్ క్రెటా ఎస్ యూవీ మోడల్లో ఉన్నట్లే ఉంటాయి. అయితే కొన్ని ఫీచర్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండు స్క్రీన్లు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్ మెంట్, ఇంకోటి ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉంటాయి. డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్, వైర్ లెస్ కార్ ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైర్, వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రిక్ ఫ్రంట్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీల కెమెరా, లెవెల్ 2 అడాస్ స్యూట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

హ్యూందాయ్ క్రెటా ఈవీ స్పెసిఫికేషన్లు..

ఈ కొత్త కారుకు సంబంధించిన ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ స్పెసిఫికేషన్లు ఏవి ఇంకా వెల్లడికాలేదు. అయితే 45కేడబ్ల్యూ నుంచి 50కేడబ్ల్యూ మధ్య బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఇది సింగిల్ చార్జ్ పై 450కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మహీంద్రా ఎక్స్ యూవీ 400, నెక్సాన్ ఈవీ వంటి కార్లతో పాటు త్వరలో రానున్న హారియర్ ఈవీ, హోండా ఎలివేట్ ఈవీ వంటి కార్లకు కూడా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..