Electric Scooters Price: భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..

పర్యావరణ పరిరక్షణ, పెట్రోలు వాడకం తగ్గించడం, సహజ వనరుల రక్షణ కోసం ఈ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆ వాహనాలను కోనుగోలు చేసిన వారికి సబ్సిడీ అందజేస్తుంది. ఇందుకోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు చేపట్టింది.

Electric Scooters Price: భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
Electric Scooter Charging
Follow us

|

Updated on: Mar 19, 2024 | 8:58 AM

ఆధునిక ఫీచర్లు, అందమైన లుక్ తో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కోనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ కంపెనీలు అనేక ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కొనుగోలుదారులకు వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. నెలవారీ వాయిదాల పద్ధతిలో కూడా అందజేస్తున్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 70 నుంచి వంద కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్న ఈ వాహనాలకు డిమాండ్ కూడా భారీగా ఉంది.

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం..

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)కు ఇంత ఆదరణ పెరగడానికి పైన చెప్పిన కారణాలతో పాటు ఇంకో ముఖ్య విషయం కూడా ఉంది. అదే ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహం. పర్యావరణ పరిరక్షణ, పెట్రోలు వాడకం తగ్గించడం, సహజ వనరుల రక్షణ కోసం ఈ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆ వాహనాలను కోనుగోలు చేసిన వారికి సబ్సిడీ అందజేస్తుంది. ఇందుకోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు చేపట్టింది.

పూర్తవుతున్నఫేమ్ గడువు..

ఫేమ్( ఎఫ్ఏఎమ్ఈ) 1, 2 పథకాల ద్వారా ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు సబ్సిడీ అందజేసింది. మార్చి 31వ తేదీతో ఎఫ్ ఫేమ్-2 పథకం గడువు పూర్తవుతుంది. అనంతరం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (ఈఎమ్ పీఎస్) అనే కొత్త పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. దీని ద్వారా దాదాపు నాలుగు నెలల పాటు సబ్సిడీ అందజేస్తారు. అయితే కొత్త పథకం ద్వారా ఈవీలకు ఇచ్చే సబ్సిడీ తగ్గిపోతుందని, ఫేమ్ పథకాలతో పోల్చితే బాగా తక్కువ అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కొత్త పథకంలో సబ్సిడీపై కోత..

ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఐసీఆర్ ఏ) సర్వే ప్రకారం.. భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎమ్ పీఎస్) వల్ల ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రారంభ కొనుగోలు వ్యయం పెరుగుతుంది. చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల ధరలు దాదాపు పదిశాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్ ఏఎమ్ఈ 2 పథకంతో పోల్చినప్పడు కొత్త పథకంలో సబ్సిడీలు తక్కువగా కేటాయించారు.

ఈఎమ్ పీఎస్ అమలు..

భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 31వ తేదీ వరకూ నాలుగు నెలలు అమలులో ఉంటుంది. ఈ సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రి చక్ర వాహనాలను కొనుగోలు చేసే వారికి సబ్సిడీగా అందించడానికి రూ. 500 కోట్లు కేటాయించారు. ద్విచక్ర వాహనాలపై గరిష్టంగా రూ.10 వేల సబ్సిడీని అందిస్తారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం కేటాయించిన ఖర్చులో మూడింట రెండు వంతుల ప్రారంభ కొనుగోలు ఖర్చులు పెరుగుతాయి. ఇవి ఐసీఈతో నడిచే వాహనాల కంటే 70 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ధరలు పెరిగే అవకాశం..

ఫేమ్ 2 ఫ్రేమ్‌వర్క్ కింద ఐదేళ్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్‌ల చెల్లింపు వ్యవధి 5.5 సంవత్సరాలకు పొడిగించవచ్చు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు వాహనాల ధరలను పెంచి, వినియోగదారులకు సబ్సిడీ తగ్గిస్తారు. అయినప్పటికీ, ఐసీఈ వాహనాలతో పోల్చినప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వల్ల ధీర్ఘకాలిక లాభాలు ఉన్నాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం ద్వారా కూడా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ప్రోత్సహిస్తోంది. దీనివల్ల కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దేశ పరిశ్రమలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం 2025 నాటికి 6 నుంచి 8 శాతానికి పెరుగుతుందని ఐసీఆర్ఏ అంచనా వేసింది. ప్రస్తుతం అది సుమారుగా 5 శాతంగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..