AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyundai Creta: సూపర్‌ స్టైలిష్‌ లుక్‌తో హ్యూందాయ్‌ క్రెటా.. ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ప్రీ బుకింగ్స్‌ ఓపెన్‌

హ్యూందాయ్‌ క్రెటా ఎక్కువ ప్రజాదరణ పొందింది. అయితే ఇటీవల అన్ని కంపెనీలు సక్సెస్‌ అయిన కార్లల్లో ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో హ్యూందాయ్‌ క్రెటా కూడా వచ్చి చేరింది. ఇప్పుడు హ్యూందాయ్‌ క్రెటా ఫేస్‌ లిఫ్ట్‌ వెర్షన్‌కు సంబంధించిన తాజా వార్త అందరినీ ఆకర్షిస్తుంది. ఈ వెర్షన్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌కు సంబంధించిన నయా కలర్‌ ప్యాట్రన్‌తో ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది.

Hyundai Creta: సూపర్‌ స్టైలిష్‌ లుక్‌తో హ్యూందాయ్‌ క్రెటా.. ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ప్రీ బుకింగ్స్‌ ఓపెన్‌
Hyundai Creta
Nikhil
|

Updated on: Jan 11, 2024 | 5:00 PM

Share

సొంతకారు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి కొంత సొమ్మును పొదుపు చేసి వాటితో పాటు వాహన ఈఎంఐతో కారును కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే భవిష్యత్‌లో పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో గతంలో చిన్న కార్లు చాలు అనుకునే వారు ఇప్పుడు అత్యాధునిక ఫీచర్స్‌తో వచ్చే కొంచెం పెద్ద కార్లను ఇష్టపడుతున్నారు. ఇలాంటి కార్స్‌లో హ్యూందాయ్‌ క్రెటా ఎక్కువ ప్రజాదరణ పొందింది. అయితే ఇటీవల అన్ని కంపెనీలు సక్సెస్‌ అయిన కార్లల్లో ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో హ్యూందాయ్‌ క్రెటా కూడా వచ్చి చేరింది. ఇప్పుడు హ్యూందాయ్‌ క్రెటా ఫేస్‌ లిఫ్ట్‌ వెర్షన్‌కు సంబంధించిన తాజా వార్త అందరినీ ఆకర్షిస్తుంది. ఈ వెర్షన్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌కు సంబంధించిన నయా కలర్‌ ప్యాట్రన్‌తో ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఈ మేరకు హ్యూందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

భారతదేశంలోని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బెస్ట్ సెల్లర్ అయిన హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో చాలా ఫీచర్సను అందిస్తుంది. హ్యూందాయ్ క్రెటా బ్లాక్ కలర్‌తో వస్తుంది. హ్యుందాయ్ తన అధికారిక అరంగేట్రానికి ముందు కొత్త క్రెటా 2024 మోడల్‌కు సంబంధించిన మొదటి అధికారిక చిత్రాలను విడుదల చేసింది. హ్యూందాయ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన షారూఖ్‌ ఖాన్ డ్రైవ్‌ చేస్తున్నట్లు కంపెనీ వీడియో రిలీజ్‌ చేసింది. 2024 హ్యుందాయ్ క్రెటా ఈ, ఈఎక్స్‌, ఎస్‌, ఎస్‌(ఓ), ఎస్‌ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌ టెక్‌, ఎస్‌ఎక్స్‌ (ఓ) అని ఏడు వేరియంట్‌లలో వస్తుది. ఈ కారు 1 డ్యూయల్-టోన్ మరియు 6 మోనో-టోన్ కలర్ ఆప్షన్‌లను పొందుతుంది. వీటిలో అట్లాస్ వైట్ బ్లాక్ రూఫ్‌తో పాటు బలమైన ఎమరాల్డ్ పెర్ల్ (కొత్త), ఫైరీ రెడ్, రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్ మరియు టైటాన్ గ్రే ఉన్నాయి. డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ రెండు టాప్ స్పెక్ వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేశారు. 

ఈ కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్ అవుట్‌ సైడ్‌ మార్పులు గణనీయంగా ఉన్నాయి. బ్లాక్ క్రోమ్ యాక్సెంట్‌లు, రివైజ్డ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌తో కూడిన కొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో కొత్త ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, సెట్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ ప్రత్యేకతగా ఉంటాయి. కొత్త క్రెటా పొడవునా కనెక్ట్ చేసేలా ఎల్‌ఈడీ టెయిల్ బార్ , హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కొత్త స్పాయిలర్, 3డీ హ్యుందాయ్ లోగోతో వస్తుంది. అలాగే ఇంటీరియర్‌ విషయానికి వస్తే 10.2 అంగుళాల డిస్‌ప్లే యూనిట్‌లతో సవరించిన డాష్‌బోర్డ్ డిజైన్‌తో  వస్తుంది. అలాగే 8 స్పీకర్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్‌తో ఉంటుంది. ఈ కారులో ఉచిత స్ట్రీమింగ్‌తో జియో సావన్‌కు 1 సంవత్సరం సభ్యత్వంతో వస్తుంది. టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్, యాంబియంట్ లైటింగ్, కొత్త గేర్ లివర్, బ్లైండ్-వ్యూ మానిటర్, 8 వే పవర్ డ్రైవ్ సీట్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ద్వారరా శక్తిని పొందుతుంది. కొత్త టర్బో పెట్రోల్ యూనిట్ 7 స్పీడ్ డీసీటీతో జత చేసింది. ఈ కారు ధర రూ. 11 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..