Post Office Schemes: మహిళలకు బెస్ట్ స్కీమ్స్ ఇవే.. భద్రత.. భరోసా.. అధిక రాబడి..
పోస్ట్ ఆఫీసులు ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక పథకాలు తీసుకొస్తూ వారి మన్ననలు అందుకుంటున్నాయి. వాటిల్లో మహిళలకు ఉపయోగపడే స్కీమ్లు కూడా ఉన్నాయి. అలాంటి స్కీమ్లలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఒకటైతే.. మరొకటి బాలికల కోసం ప్రత్యేకించిన సుకన్య సమృద్ధి యోజన. ఈ రెండు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీసులో పథకం అనగానే ప్రజలకు సెక్యూర్ గా ఫీల్ అవుతారు. దానిలో పెట్టుబడులు పెట్టమంటే మరో ఆలోచన లేకుండా పెట్టుబడి పెడతారు. ఎందుకంటే ఈ పోస్ట్ ఆఫీసులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. అందుకే వీటిల్లో పెట్టుబడికి భద్రత, భరోసా ఉంటుందని అందరూ భావిస్తారు. ఇటీవల కాలంలో పోస్ట్ ఆఫీసులు కూడా డిజిటల్ బాట పట్టాయి. ఆన్ లైన్ లేదా యాప్ సాయంతో అవసరమైన సేవలు అందిస్తున్నాయి. అలాగే పోస్ట్ ఆఫీసులు ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక పథకాలు తీసుకొస్తూ వారి మన్ననలు అందుకుంటున్నాయి. వాటిల్లో మహిళలకు ఉపయోగపడే స్కీమ్లు కూడా ఉన్నాయి. అలాంటి స్కీమ్లలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఒకటైతే.. మరొకటి బాలికల కోసం ప్రత్యేకించిన సుకన్య సమృద్ధి యోజన. ఈ రెండు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వాటిల్లో ఏది అధిక ప్రయోజనాలు ఇస్తోందో చూద్దాం..
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎంఎస్ఎస్సీ)..
ఈ పథకాన్ని 2023లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ప్రత్యేకించి ప్రవేశపెట్టారు. ఏ వయసు మహిళైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. రెండేళ్లలో దీని నుంచి అధిక రాబడిని పొందొచ్చు. దీనిలో గరిష్ట పెట్టుబడి రూ. 2లక్షలుగా ఉంటుంది. రెండేళ్ల పాటు దీనిలో పెట్టే పెట్టుబడిపై 7.50శాతం స్థిరమైన వడ్డీ రేటు పొందొచ్చు. అలాగే దీనిలో పెట్టుబడిపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మీరు రూ. 1.50లక్షల వరకూ రాయితీ లభిస్తుంది. మీరు ఒకవేళ రూ. 2లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి మీకు రూ. 2,32,044లక్షలు పొందే అవకాశం ఉంది.
సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్‌వై)..
బాలికల కోసం, వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. 2014లో దీనిని ప్రారంభించింది. బాలికల తల్లిదండ్రులు ఈ ఖాతా ప్రారంభించొచ్చు. అమ్మాయి పుట్టిన రోజు నుంచి 10 ఏళ్ల లోపు దీనిని ప్రారంభించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 250 నుంచి ప్రారంభించి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకూ దీనిలో పెట్టుబడి పెట్టొచ్చు. అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకం మెచ్యూరిటీ సాధిస్తుంది. 18 ఏళ్లు దాటటిన తర్వాత అప్పటి వరకూ డిపాజిట్ చేసిన మొత్తంలో 50శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. ఇది ఆడ బిడ్డల ఉన్నత చదువులు, వారి పెళ్లిళ్లకు బాగా ఉపకరిస్తుంది. దీనిపై వచ్చే వడ్డీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం దీనిపై 8.2శాతం వడ్డీ వస్తోంది.
ఎంఎస్ఎస్సీ వర్సెస్ ఎస్ఎస్వై ఏది బెటర్?
మహిళా అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ఈ రెండు పథకాలు దేని కదే ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అయితే దీనిలో ప్రధానంగా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. అది ఏంటంటే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనేది స్వల్ప కాలిక పొదుపు పథకం. తాత్కాలిక అవసరాలను పరిగణలోకి తీసుకుని దీనిలో పెట్టుబడి పెట్టొచ్చు. అయితే సుకన్య సమృద్ధి యోజన అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇది ఆడ బిడ్డల ఉన్నత చదువులు, పెళ్లి వంటి ఖర్చుకు బాగా ఉపయోగపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..