Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Electric Cars: వచ్చేస్తున్నాయ్.. కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. లిస్ట్‌లో టాప్ బ్రాండ్లు.. ఓ లుక్కేయండి..

ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు కొత్త సంవత్సరంలో కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులు పలు కొత్త మోడళ్లను పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకదాని కొకటి పోటాపోటీగా కార్లను లాంచ్ చేసేందుకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. ఈ జాబితాలో టాటా, మహీంద్రా, బీవైడీ, మారుతి సుజుకీ వంటి టాప్ బ్రాండ్లు ఉన్నాయి. ఆ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

Upcoming Electric Cars: వచ్చేస్తున్నాయ్.. కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. లిస్ట్‌లో టాప్ బ్రాండ్లు.. ఓ లుక్కేయండి..
Maruti Suzuki Evx
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 12, 2024 | 2:30 PM

మన దేశంలో విద్యుత్ శ్రేణి వాహనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. 2023లో అత్యధికంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు జరిగాయి. సంప్రదాయ ఐసీఈ ఇంజిన్ వాహనాలతో సమానంగా ఇవి కూడా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు కొత్త సంవత్సరంలో కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులు పలు కొత్త మోడళ్లను పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకదాని కొకటి పోటాపోటీగా కార్లను లాంచ్ చేసేందుకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. ఈ జాబితాలో టాటా, మహీంద్రా, బీవైడీ, మారుతి సుజుకీ వంటి టాప్ బ్రాండ్లు ఉన్నాయి. ఆ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

టాటా పంచ్ ఈవీ..

వినియోగదారులు అత్యంత ఆసక్తి ఎదురుచూస్తున్న లాంచ్‌లలో ఒకటి టాటా పంచ్ ఈవీ. టాటా అల్ఫా ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమైన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ మన దేశంలో అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎస్యూవీగా నిలువనుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికల్లో వస్తుందని భావిస్తున్నారు. లాంగ్-రేంజ్ వేరియంట్ ఒక్కో ఛార్జ్‌కు 315 కిమీల పరిధిని అందిస్తుంది.

మారుతి సుజుకీ ఈవీఎక్స్..

మారుతి సుజుకీ నుంచి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. మారుతి సుజుకీ ఈవీఎక్స్ పేరిట ఎలక్ట్రిక్ ఎస్యూవీని రంగంలోకి దించుతోంది. దీనిలో 60కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై దాదాపు 550కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని చెబుతున్నారు. ఎంట్రీ-లెవల్ వేరియంట్ కోసం చిన్న బ్యాటరీ ఎంపిక కూడా ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

బీవైడీ ఎలక్ట్రిక్ సెడాన్..

చైనాకు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు బీవైడీ మన దేశంలో ఓ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ ను లాంచ్ చేసేందుకు ప్రణాళిక చేసింది. ఇది ఈ-ప్లాట్ ఫారం 3.0పై ఆధారపడి ఉంటుంది. రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు, 700 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని యాక్సెలరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం 3.8సెకండ్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మహీంద్రా ఎక్స్ యూవీ 300..

ఈవీ మార్కెట్లో మహీంద్రా తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. నెక్సాన్ ఈవీకి పోటీగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ గా ఎక్స్ యూవీ300 ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇంకా బయటకు రాలేదు. అయితే ఎక్స్ యూవీ 400 కన్నా బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉంటుందని మాత్రం చెబుతున్నారు.

మహీంద్రా ఎక్స్ యూవీ.ఈ8..

ఇది మహీంద్రా నెక్ట్స్ జెన్ ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్ లో ఉంది. ఈ ఎక్స్ యూవీ కారు 80కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బ్యాటరీతో వస్తుంది. రెండు పవర్ అవుట్ పుట్లను అందిస్తుంది. 230హెచ్పీ, 350హెచ్పీ, 450 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆల్-వీల్-డ్రైవ్ సామర్థ్యం కోసం ట్విన్-మోటార్ సెటప్ ఉండవచ్చు.

టాటా హారియర్..

భారతీయ ఈవీ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో త్వరలో హారియర్ ఈవీని తీసుకురావాలని యోచిస్తోంది. హారియర్ ఈవీ టాప్-స్పెక్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిమీల రేంజ్‌ను అందించగలదని భావిస్తున్నారు. సఫారీ ఎలక్ట్రిక్ వెర్షన్ గురించి కూడా ఊహాగానాలు ఉన్నాయి. అలాగే టాటా కర్వ్ వచ్చే కూడా ఈ ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..