Telugu News Business How To Submit Life Certificate Through SBI Website And Mobile App In Easy Steps
Life Certificate: ఎస్‌బీఐ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి?
లైఫ్ సర్టిఫికేట్ సమర్పణను మరింత సులభతరం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త వీడియో లైఫ్ సర్టిఫికేట్ (వీఎల్‌సీ) సేవను ప్రారంభించింది..
211 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటును బ్యాంక్ పెంచింది. తాజా పెంపు తర్వాత, 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే FDలు 25 bps అదనపు- 5.75 % వడ్డీ వస్తుంది. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే FDలు సాధారణ ప్రజలకు 65 bps అదనపు వడ్డీ అందుతుంది.
లైఫ్ సర్టిఫికేట్ సమర్పణను మరింత సులభతరం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త వీడియో లైఫ్ సర్టిఫికేట్ (వీఎల్‌సీ) సేవను ప్రారంభించింది. పెన్షనర్లు ఇప్పుడు ఎస్‌బీఐ అధికారికి వీడియో కాల్ చేయడం ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి సంవత్సరం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ (పిడిఎ) కి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ కొత్త సేవ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి అనుమతిస్తుంది. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సేవను అందించడం ప్రారంభించడం గురించి ఒక ట్వీట్ ద్వారా వినియోగదారులకు సందేశాన్ని పంపింది.
వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను ఎలా సమర్పించాలి?
ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను ఓఎప్ చేయండి. లేదా పెన్షన్ సేవా మొబైల్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయండి.
వెబ్‌సైట్ ఎగువన ఉన్న ‘VideoLC’ లింక్‌పై క్లిక్ చేయండి. మొబైల్ యాప్‌లో ‘వీడియో లైఫ్ సర్టిఫికేట్’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీరు పింఛను పొందే ఖాతా నంబర్‌ను నమోదు చేయండి. మీ ఆధార్ వివరాలను నిర్ధారించడానికి క్యాప్చర్‌ను ఎంటర్ చేయండి.
‘ఖాతాను ధృవీకరించు’ బటన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపబడుతుంది.
తర్వాత ఓటీపీ నమోదు చేసిన తర్వాత సంబంధిత సర్టిఫికేట్‌లను సబ్మిట్, కొనసాగించు క్లిక్ చేయండి
మీ సౌలభ్యం మేరకు వీడియో కాల్ కోసం అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి కొత్త పేజీలోని సూచనలను అనుసరించండి. ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా నిర్ధారణ సందేశం పంపబడుతుంది.
తర్వాత వీడియో కాల్‌లో చేరండి
మీరు వీడియో కాల్ సమయంలో బ్యాంక్ అధికారి ముందు ధృవీకరణ కోడ్‌ను చదవాలి. అలాగే పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది.
ధృవీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత మీ మొబైల్‌ను స్థిరంగా పట్టుకోండి. ఎందుకంటే కెమెరా ద్వారా బ్యాంక్ అధికారి మీ ముఖ చిత్రాన్ని క్యాప్చర్ చేస్తారు.
వీడియో కాల్ ముగిసినట్లు మీకు ఓ మెసేజ్ వస్తుంది. వీడియో లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ ప్రక్రియ పూర్తయినట్లు పెన్షనర్‌కు ఎస్‌ఎంఎస్‌ను అందుకుంటారు.