LPG Gas Cylinder: ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!

గ్యాస్‌ సిలిండర్‌ ప్రతి ఒక్కరు వాడేదే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు గ్యాస్‌ సిలిండర్‌పైనే వంట చేసుకుంటున్నారు. ఏ ఒక్కరు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకూడదనే..

LPG Gas Cylinder: ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
Lpg Gas Cylinde
Follow us

|

Updated on: Nov 14, 2022 | 11:31 AM

గ్యాస్‌ సిలిండర్‌ ప్రతి ఒక్కరు వాడేదే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు గ్యాస్‌ సిలిండర్‌పైనే వంట చేసుకుంటున్నారు. ఏ ఒక్కరు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకూడదనే ఉద్దేశంతో కేంద్రం రాయితీలు కల్పించి సామాన్యులు కూడా గ్యాస్‌ సిలిండర్‌ వినియోగించేలా చర్యలు చేపట్టింది. అయితే గ్యాస్‌ సిలిండర్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

గ్యాస్‌ సిలిండర్‌ ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది?

గ్యాస్‌ సిలిండర్‌ ఎరువు రంగులో ఉంటుంది. ఇలా ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందని మీరెప్పుడైనా గమనించారా? అందుకు కారణం లేకపోలేదు. ఎరుపు రంగును హెచ్చరిక చిహ్నంగా భావిస్తారు. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌లో మండే వాయువు ఉంటుంది. అందుకే సిలిండర్ కూడా ప్రమాదకరం. వినియోగదారుల భద్రత కోసం గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఇది కాకుండా దీనికి సైన్స్‌తో కూడా ముడిపడి ఉంది. ఎరుపు రంగును దూరంగా ఉన్నా సులభంగా గుర్తించవచ్చు. ఇతర రంగులను గుర్తించడం కొంత కష్టంగా ఉన్నా ఎరుపు రంగులను గుర్తించడం సులభం. ఎరుపు రంగు అంటేనే ప్రమాదానికి చిహ్నం. సిలిండర్‌ అంటేనే ప్రమాదకరం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ సిలిండర్‌కు ఎరుపు రంగును వేస్తుంది. ఎరుపు రంగు అనేది ప్రమాదాలకు చిహ్నం కనుక దూరం నుంచి కూడా ఎరుపు రంగును గుర్తించవచ్చు. అందుకే సిలిండర్‌కు ఈ రంగు వేయడానికి కారణమని తెలుస్తోంది.

గ్యాస్ ఎందుకు వాసన వస్తుంది?

గ్యాస్‌ సిలిండర్‌ను తయారు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎల్‌పీజీకి వాసన ఉండదు. దీనికి మండే స్వభావం ఉంటంది. వాసన లేకపోతే ఎల్‌పీజీ లీక్ అవుతుందా? లేదా? అని గుర్తించడం కష్టం అవుతుంది. దీంతో ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రమాదాలను నివారించడానికి ఇందులో ఇథైల్ మోర్కాంప్టన్ కలిపి వాసన వచ్చేలా చేస్తారు. అలాంటప్పుడు గ్యాస్‌ లీకైతే వెంటనే వాసన వస్తుంది. దీని వల్ల ప్రమాదం జరుగకుండా జాగ్రత్త పడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ