Making Blood: ల్యాబ్‌లో రక్తం తయారీ.. తొలిసారి మనుషుల్లోకి ఎక్కించి.. ఇదో అద్భుతంమైన ప్రయోగం..వీడియో
శరీరం బయట తొలిసారి ల్యాబ్‌లో రక్తాన్ని తయారుచేసి అద్భుతం చేశారు యూకే శాస్త్రవేత్తలు. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేసే ఎర్ర రక్త కణాలపై దృష్టి సారించారు.
శరీరం బయట తొలిసారి ల్యాబ్‌లో రక్తాన్ని తయారుచేసి అద్భుతం చేశారు యూకే శాస్త్రవేత్తలు. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేసే ఎర్ర రక్త కణాలపై దృష్టి సారించారు. ముందుగా ఎర్ర రక్త కణాలుగా మారే మూల కణాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో పెద్దమొత్తంలో పెరిగేలా చేశారు. మూడు వారాలకు 5 లక్షల మూల కణాలు.. 5 వేల కోట్ల ఎర్ర రక్త కణాలుగా మారాయి. వాటిని శుద్ధి చేయగా, 1500 కోట్ల ఎర్ర రక్త కణాలు ట్రాన్స్‌ప్లాంట్‌కు పనికొచ్చాయి.ట్రయల్స్‌లో భాగంగా తొలిసారిగా ఇద్దరికి ఈ రక్తాన్ని ఎక్కించి పరీక్షిస్తున్నారు. ‘కొన్ని గ్రూప్‌ల రక్తం చాలా అరుదు. ఆ బ్లడ్ గ్రూప్‌లు ఉన్నవారికి రక్తం దొరక్కపోతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే రక్త దానంపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ ప్రయోగం చేపట్టాం’ అని బ్రిటన్‌కు చెందిన ఎన్‌హెచ్‌ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ మెడికల్ డైరెక్టర్ ఫారుక్ షా తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

