Bike Drive: ప్లీజ్.. నాలా ఎవరూ చేయకండి..! ఎక్స్ ప్రెస్ వేపై 310 కి.మీ. వేగంతో బైక్ నడిపిన రైడర్.. (వీడియో)
అతి వేగం ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా కొందరు తమ వాహనాలపై వేగంగా దూసుకుపోతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. వారి ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తారు. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై 300 కిమీ వేగంతో వెళ్తున్న నలుగురు వ్యక్తులు బీఎమ్‌డబ్ల్యూ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే హర్యానాలోని వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై గంటకు 310 కి.మీ వేగంతో ఒక వ్యక్తి తన బైక్‌ను నడుపుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది.ఇందులో బైకర్ దిల్‌ప్రీత్, మరికొందరు బైకర్లతో కలిసి రైడ్ కోసం బయలుదేరాడు. అతను 310 కి.మీ వేగాన్ని చాలాసార్లు తాకినట్లు వీడియోలో తెలుస్తుంది. బైకర్లు నింజా 2000, బీఎండబ్ల్యూ, డ్యుకాటీ, అపాచీ 310 వంటి హై ఎండ్ బైకులపైన వాయు వేగంతో దూసుకెళ్లారు. 300 కి.మీ వేగం అందుకున్న రైడర్ దిల్‌ప్రీత్ తనలా ఎవ్వరూ ఇలాంటి సాహనం చేయొద్దని హెచ్చరించాడు. ఈ వీడియో ఓ ప్రముఖ సోషల్‌మీడియా ఛానెల్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

