AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Bill Scam: మీకు కరెంటు బిల్లు బకాయిల పేరుతో మెసేజ్‌లు వస్తే స్పందిస్తున్నారా? ఇక అంతే సంగతి

దేశంలో సైబర్ దొంగల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసం చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో ..

Electricity Bill Scam: మీకు కరెంటు బిల్లు బకాయిల పేరుతో మెసేజ్‌లు వస్తే స్పందిస్తున్నారా? ఇక అంతే సంగతి
scam with schemes
Subhash Goud
|

Updated on: Nov 13, 2022 | 10:02 AM

Share

దేశంలో సైబర్ దొంగల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసం చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో ఎన్ని హెచ్చరికలు చేసినా కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొబైల్‌లో కరెంట్ బిల్లు బకాయి ఉందని ఆన్‌లైన్ ద్వారా సందేశాలు పంపి ప్రజలను మోసం చేస్తున్న అక్రమార్కులు ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెస్కామ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలకు మెసేజ్‌లను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. విద్యుత్ సంస్థ పేరుతో మోసగాళ్లు మెసేజ్ లు పంపి ఫోన్ చేయాలని సూచించడం, లేని పక్షంలో డిస్ కనెక్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

కర్నాటక, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో కరెంటు బిల్లు చెల్లించాలన్న సందేశం వెల్లువెత్తుతోంది. ‘ప్రియమైన కస్టమర్, మీ మునుపటి నెల బిల్లును అప్‌డేట్ చేయనందున ఈ రోజు రాత్రి 9.30 గంటలకు విద్యుత్ కార్యాలయం ద్వారా మీ విద్యుత్ కనెక్షన్ డిస్‌కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి వెంటనే మా విద్యుత్ అధికారిని సంప్రదించండి ధన్యవాదాలు’ అని మొబైల్ నంబర్‌తో పాటు సందేశం కూడా పంపుతున్నారు. ఈ సందేశం అధికారుల నుంచి రానప్పటికీ జనాలను నమ్మించి మోసగిస్తున్నారు. నిజంగానే విద్యుత్‌ డిస్‌కనెక్ట్‌ అవుతుందనే భయంతో సదరు వినియోగదారులు పంపిన నెంబర్‌కు ఫోన్‌ చేయగానే వారి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా రాబట్టుకుంటున్నారు. ఇలా ఫోన్‌ చేయడం వల్ల వారి అకౌంట్‌లో ఉన్న డబ్బులన్ని ఖాళీ అయిపోతున్నాయి. తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్‌కు గురవుతున్నారు.

BESCOM నుండి హెచ్చరిక:

బెస్కామ్ ఏ మొబైల్ నంబర్ నుండి వినియోగదారులకు ఎలాంటి సందేశాలను పంపదు. అలాగే ఓటీపీ, పాస్‌వర్డ్ చెప్పాలని అడగదు. బెస్కామ్ పేరుతో ఓటీపీ, పాస్ వర్డ్ అడిగితే కచ్చితంగా మోసపూరిత నెట్ వర్క్ అని బెస్కామ్ హెచ్చరించింది. ‘బెస్కామ్ పేరుతో నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావచ్చు. దయచేసి ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడండి’ అని విద్యుత్ సరఫరా సంస్థ హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఐటీ కంపెనీల్లో పని చేసేవారే..

ఐటీ కంపెనీల్లో ఏదో ఒక పని చేస్తున్న వాళ్లే ఎక్కువ మందికని టార్గెట్‌ చేస్తున్నారు.. ఈ రకమైన మోసం చాలా ప్రమాదకరమైనది. దీనిలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని మోసగాడు కస్టమర్‌ని ఆదేశిస్తాడు. ఇది ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత మోసగాడు మీ మొబైల్‌కు పూర్తి యాక్సెస్‌ను పొందుతాడు. మీ బ్యాంక్ వివరాలు, ఫోటోలు, వాట్సాప్‌ చాట్‌లు, ఇమెయిల్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. ఈ మోసాల వల్ల మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్