AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oneplus 11: వన్‌ప్లస్‌ 11 సిరీస్‌ వచ్చేస్తోంది.. ఇంతవరకు ఎప్పుడూ చూడని కెమెరాతో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లు..

మొన్నటి వరకు బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న వన్‌ప్లస్‌ బ్రాండ్‌ తాజాగా వరుసగా ప్రీమియం ఫోన్‌లను తీసుకొస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3తో బడ్జెట్‌ యూజర్లను అట్రాక్ట్ చేసిన వన్‌ప్లస్‌ ఇప్పుడు మళ్లీ ప్రీమియం మార్కెట్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది...

Oneplus 11: వన్‌ప్లస్‌ 11 సిరీస్‌ వచ్చేస్తోంది.. ఇంతవరకు ఎప్పుడూ చూడని కెమెరాతో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లు..
Oneplus 11
Narender Vaitla
|

Updated on: Nov 12, 2022 | 9:12 PM

Share

మొన్నటి వరకు బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న వన్‌ప్లస్‌ బ్రాండ్‌ తాజాగా వరుసగా ప్రీమియం ఫోన్‌లను తీసుకొస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3తో బడ్జెట్‌ యూజర్లను అట్రాక్ట్ చేసిన వన్‌ప్లస్‌ ఇప్పుడు మళ్లీ ప్రీమియం మార్కెట్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వన్‌ప్లస్‌ 11 సిరీస్‌ను లాంచ్‌ చేస్తోంది. అధునాతన ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో రానున్న ఈ ఫోన్‌లో రౌండ్‌ షేప్‌లో ట్రిపుల్‌ కెమెరాను అందిస్తోంది.

ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 11, వన్‌ప్లస్‌ 11 ప్రోను లాంచ్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు సంబంధించిన వన్‌ప్లస్‌ సూచనప్రాయన ప్రకటన మాత్రమే చేసింది. అయితే నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. డిజిటల్‌ చాట్‌ స్టేషన్‌ అంచనా ప్రకారం ఈ ఫోన్‌లలో ఉండే ఫీచర్లు ఇవేనంటూ ఓ వార్త నెట్టింట వెరల్‌ అవుతోంది. వాటి ఆధారంగా ఆ సిరీస్‌లో ఫోన్‌లో కెమెరాకు పెద్ద పీట వేశారు. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ సోనీ ఐఎంఎక్స్‌ 890 ప్రైమరీ, 48 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్‌ షూటర్‌, 32 మెగాపిక్సెల్‌ ఐఎంఎక్స్‌ 709 టెలిఫొటో కెమెరాను ఇవ్వనున్టన్లు సమాచారం. 2x ఆప్టికల్ జూమ్ ఈ కెమెరా ప్రత్యేకగా చెప్పొచ్చు.

ఇక వన్‌ప్లస్‌ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు తెలుస్తోంది. ఇక బ్యాటరీకి కూడా ఈ ఫోన్‌లో ప్రత్యేక స్థౄనాన్ని కల్పించారు. ఇందులో ఏకంగా 100 డబ్లూ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. వచ్చ ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. ధర విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..