AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nose Transplant: ముఖానికి ఉండాల్సిన ముక్కు.. చేతికి వచ్చింది.. వైద్యుల అద్భుత సృష్టి..!

ముక్కు ఎక్కడ ఉంటుంది? అని ఎవరినైనా ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. తల నుంచి కాళ్ల వరకు ఎగాదిగిన చూసి.. పిచ్చోడు అనుకుని నవ్వుకుంటూ వెళ్లిపోతారు.

Nose Transplant: ముఖానికి ఉండాల్సిన ముక్కు.. చేతికి వచ్చింది.. వైద్యుల అద్భుత సృష్టి..!
Transplant Nose
Shiva Prajapati
|

Updated on: Nov 12, 2022 | 2:44 PM

Share

ముక్కు ఎక్కడ ఉంటుంది? అని ఎవరినైనా ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. తల నుంచి కాళ్ల వరకు ఎగాదిగిన చూసి.. పిచ్చోడు అనుకుని నవ్వుకుంటూ వెళ్లిపోతారు. ఎందుకంటే.. ఎవరికైనా ముక్కు మొహం మీదే ఉంటుంది. అయితే, ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉంది. ముఖానికి ఉండాల్సిన ముక్కు చేతికి వచ్చింది. అవును.. ఓ మహిళ చేతికి ముక్కు వచ్చింది. అదెలాగంటారా? వైద్యుల మిరాకిల్. క్యాన్సర్ చికిత్స సమయంలో ముక్కును కోల్పోయిన మహిళకు.. వైద్యులు 3డి ప్రింటెడ్ బయోమెటీరియల్‌తో తయారు చేసిన కస్టమ్ ముక్కును అమర్చారు. ముఖంపై వీలుకాకపోవడంతో.. ఆమె చేతిపై ఆ ముక్కును ఏర్పాటు చేశారు. ముంజేయిపై కృత్రిమ ముక్కు పూర్తిగా వృద్ధి చెందిన తరువాత ఆ ముక్కును తిరిగి యధావిధిగా మహిళ ముఖానికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు వైద్యులు.

ఈ మిరాకిల్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాన్స్‌లోని టౌలౌస్‌కు చెందిన మహిళ క్యాన్సర్ బారిన పడింది. దాంతో 2013లో రేడియోథెరపీ, కీమోథెరపీతో చికిత్స తీసుకుంది. అయితే, చికిత్స సమయంలో నాసికా కుహరం భాగాన్ని కోల్పోయింది. నాసికా కుహరాన్ని పునర్నించే ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దాంతో ఆ మహిళ ముక్కు లేకుండానే కొన్ని సంవత్సరాలు జీవనం సాగించింది. ఇప్పుడు వైద్యులు అద్భుతాన్ని సృష్టించారు. ఆమెకు కొత్త ముక్కు ఇవ్వగలిగారు. మృదులాస్థి స్థానంలో 3డి ప్రింటెడ్ బయోమెటీరియల్‌తో తయారు చేసిన కస్టమ్ ముక్కును తయారు చేసి ఆమె ముంజేయిపై అమర్చారు. ఆమె స్కిన్ గ్రాఫ్ట్‌ను ఉపయోగించి.. ఆ 3డీ ముక్కును కవర్ చేశారు. ఈ 3డీ ప్రింటెడ్ ముక్కు, చేతికి అతకడానికి రెండు నెలల సమయం పట్టింది. ఆ ముక్కు పూర్తిగా వృద్ధి చెందిన తరువాత.. తిరిగి దానిని ఆమె ముఖానికి అమర్చారు.

అయితే, ఫేస్‌బుక్‌లో టౌలౌస్ యూనివర్సిటీ హాస్పిటల్(CHU) సిబ్బంది.. ముంజేయిపై పెరుగుతున్న ముక్కు కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. రెండు రోజుల క్రితమే ఆ ముక్కును మహిళ ముఖానికి విజయవంతంగా అమర్చినట్లు వైద్యులు వెల్లడించారు. ‘‘ఇవాళ ముక్కు మార్పిడీ విజయవంతమైంది. రెండు నెలల పాటు వైద్య పరికరాన్ని ముంజేయిలో ఉంచడం, అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తరువాత దానిని నాసికా ప్రాంతంలోకి మార్పిడీ చేయడం జరిగింది. రక్తనాళాల అనాస్టోమోసెస్ ద్వారా మైక్రో-సర్జరీని ఉపయోగించి విజయవంతంగా రీవాస్క్యూలారైజ్ చేయొచ్చు. ఈ చికిత్స విజయవంతం అయ్యింది. శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఈ రకమైన చికిత్స ఇంతకుముందెన్నడూ, ఇంత సక్సెస్‌ఫుల్‌గా జరుగలేదు. ఇప్పుడు సాధ్యమైంది.’’ ఆస్పత్రి సిబ్బంది ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..