PVC Aadhaar Card: ఒకే ఫోన్ నంబర్‌తో కుటుంబం మొత్తానికి ఆధార్ పీవీసీ కార్డులు పొందవచ్చు.. ఎలాగంటే..
PVC Aadhaar Card: మనకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రతి అవసరానికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది..
PVC Aadhaar Card: మనకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రతి అవసరానికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ప్రభుత్వ పథకాల నుంచి చిన్నా చితక అవసరాలకు ఆధార్ తప్పనిసరి. ఇక బ్యాంకుకు సంబంధించిన వాటికి ఆధార్ లేనిది పని జరగదు. అలాగే ఆధార్‌కు ఫోన్ నంబర్, పాన్ నెంబర్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఏ డాటా కావాలన్నా ఆధార్‌తో తెలిసిపోతుంది. ఇక తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ ప్రకటన చేసింది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకున్నా.. ఏ మొబైల్ నంబర్ అయినా ఉపయోగించి పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేనివారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే ఒకే ఫోన్ నంబర్‌తో కుటుంబం మొత్తానికి పీవీసీ కార్డుల కోసం ఆర్డర్ చేసుకోవచ్చని వెల్లడించింది.
#OrderAadhaarPVC You can use any mobile number to receive #OTP for #authentication, regardless of the registered mobile number with your #Aadhaar. So, one person can order Aadhaar PVC cards online for the whole family. Follow the link https://t.co/G06YuJBrp1 to order now. pic.twitter.com/uwELWteYOT
— Aadhaar (@UIDAI) January 27, 2022
పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండిలా..
► ఆధార్ అధికారిక వెబ్‌సైట్ www.uidai. gov.in లేదా www.resident. uidai.gov.in ఓపెన్ చేయాలి.
► ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
► అందులో రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నమోదు9 చేసిటైమ్ బేస్డ్ వన్ టైమ్ పాస్‌వర్డ్(టీవోటీపీ)పై క్లిక్ చేయాలి.
► మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సెక్యూరిటీ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయాలి.
► ఒకసారి ఆధార్ వివరాలు సరి చూసుకుని ధృవీకరించుకోవాలి. తర్వాత ప్రటింగ్‌కు ఆర్డర్ ఇవ్వాలి. ఒక్కో కార్డు
► ప్రింటింగ్‌కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి: