LIC Policy: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. ల్యాప్స్‌ అయిన పాలసీల పునరుద్దరణకు అవకాశం

LIC Policy: ప్రస్తుతం కరోనా కాలంలో చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు చేసుకుంటున్నారు. గతంలో పాలసీలు తీసుకునేవారి సంఖ్య..

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. ల్యాప్స్‌ అయిన పాలసీల పునరుద్దరణకు అవకాశం
Follow us
Subhash Goud

|

Updated on: Feb 05, 2022 | 2:07 PM

LIC Policy: ప్రస్తుతం కరోనా కాలంలో చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు చేసుకుంటున్నారు. గతంలో పాలసీలు తీసుకునేవారి సంఖ్య కంటే ఇప్పుడు చాలా పెరిగిపోయారు. కొందరు బీమా పాలసీలు తీసుకున్న తర్వాత ప్రీమియంలు సరిగ్గా చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటివారి పాలసీలు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇక నిలిచిపోయిన పాలసీల పునరుద్దరణకు అవకాశం కల్పిస్తోంది ఎల్‌ఐసీ.

ల్యాప్స్‌ అయిన వ్యక్తిగత పాలసీల కోసం ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకూ ప్రత్యేక పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎల్‌ఐసీ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని పరిస్థితుల్లో ప్రీమియం చెల్లింపులు చేయలేకపోయిన పాలసీదారుల ప్రయోజనం కోసం ఈ ప్రత్యేక పునరుద్దరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది.

ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదు సంవత్సరాల్లోపు ఉన్న కొన్ని అర్హత కలిగిన పాలసీలను పునరుద్ధరించనున్నట్టు ఎల్‌ఐసీ తెలిపింది. అంతేకాకుండా ఆలస్య రుసుములో 20 నుంచి 30 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొంది. మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలపై పూర్తి రాయితీ ఉంటుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Google: భారత్‌పై గూగుల్‌ ప్రత్యేక దృష్టి.. డిజిటల్‌ హబ్‌గా మార్చేందుకు భారీ పెట్టుబడులు

PM KISAN Samman Nidhi Yojana: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..!