Tata Steel: టాటా స్టీల్‌కు లాభాల పంట.. త్రైమాసికంలో భారీగా పెరిగిన ఆదాయం..!

Tata Steel: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.9,598.16 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని నమోదు చేసుకుంది టాటా స్టీల్‌. కిందిటి ఏడాది..

Tata Steel: టాటా స్టీల్‌కు లాభాల పంట.. త్రైమాసికంలో భారీగా పెరిగిన ఆదాయం..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 06, 2022 | 1:18 PM

Tata Steel: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.9,598.16 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని నమోదు చేసుకుంది టాటా స్టీల్‌. కిందిటి ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,010.94 కోట్ల లాభంతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీ ఆదాయం భారీగా పెరగడంతో లాభాలు కలిసి వచ్చాయని తెలిపింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.42,152.87 కోట్ల నుంచి రూ.60,842.72 కోట్లకు దూసుకెళ్లినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఇక నిర్వహణ ఖర్చులు రూ.36,492 కోట్ల నుంచి రూ.48,666 కోట్లకు చేరుకున్నాయి టాటా వెల్లడించింది.

గడిచిన త్రైమాసికంలో..

గడిచిన త్రైమాసికంలో క్రూడ్‌ స్టీల్‌ ఉత్పత్తి 7.76 మిలియన్‌ టన్నులకు పెరుగగా, ఏడాది క్రితం ఇది 7.74 మిలియన్‌ టన్నులుగా ఉన్నట్లు తెలిపింది. ఇక ఇదే త్రైమాసికంలో 7.01 మిలియన్‌ టన్నుల స్టీల్‌ విక్రయాలు జరిగాయి. ఈ సందర్భంగా టాటా స్టీల్‌ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్‌ మాట్లాడుతూ.. కరోనా కాలంలో అన్ని రంగాలు నష్టాలు చవి చూశాయని, ఇక దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడు కోలుకుంటుండటంతో స్టీల్‌కు డిమాండ్‌ పెరిగిందని టాటా తెలిపింది. ఇక సెమికండక్టర్ల కొరత కారణంగా ఆటోమొబైల్‌ రంగంపై పడిన ప్రతికూల ప్రభావం స్టీల్‌ రంగంపై కూడా పడిందని, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో లాభాల వైపు దూసుకెళ్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

PVC Aadhaar Card: ఒకే ఫోన్‌ నంబర్‌తో కుటుంబం మొత్తానికి ఆధార్‌ పీవీసీ కార్డులు పొందవచ్చు.. ఎలాగంటే..

IndiGo Profit: లాభాల్లో దూసుకెళ్లిన ఇండిగో.. భారీగా పెరిగిన ఆదాయం..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!