Sovereign Bold Bonds: సావరిన్ గోల్డ్ బాండ్స్ టాక్స్ పరిధిలోకి రావా? పూర్తి వివరాలు
బంగారం కంటే సావరిన్ గోల్డ్ బాండ్ ఎలా మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. సావరిన్ గోల్డ్ బాండ్‌లు క్యాపిటల్ అప్రిసియేషన్‌తో పాటు సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని అందిస్తాయి. ఇది ప్రతి ఆరునెలలకు ఒకసారి అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే మీరు బంగారం బాండ్ రిడెంప్షన్ లేదా ప్రీ-మెచ్యూర్ రిడెంప్షన్ సమయంలో బంగారం మార్కెట్ ధరను పొందుతారు. భౌతిక బంగారం వంటి బంగారు బాండ్లను..
బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ సావరిన్ గోల్డ్ బాండ్‌ను జారీ చేస్తుంది. ఇది ప్రభుత్వ హామీతో వస్తుంది కాబట్టి, అందులో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం చాలా తక్కువ. సావరిన్ గోల్డ్ బాండ్ ఇతర ప్రభుత్వ బాండ్‌ల వంటిది కాదు. దానిలోని ప్రతి యూనిట్ 999 స్వచ్ఛత అంటే 24 క్యారెట్‌ల ఒక గ్రాము బంగారంతో అనుసంధానించి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా కనీసం ఒక గ్రాము – గరిష్టంగా 4 కిలోల విలువైన బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ పరిమితిని ప్రభుత్వ విచక్షణతో మార్చవచ్చు.
బంగారం కంటే సావరిన్ గోల్డ్ బాండ్ ఎలా మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. సావరిన్ గోల్డ్ బాండ్‌లు క్యాపిటల్ అప్రిసియేషన్‌తో పాటు సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని అందిస్తాయి. ఇది ప్రతి ఆరునెలలకు ఒకసారి అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే మీరు బంగారం బాండ్ రిడెంప్షన్ లేదా ప్రీ-మెచ్యూర్ రిడెంప్షన్ సమయంలో బంగారం మార్కెట్ ధరను పొందుతారు. భౌతిక బంగారం వంటి బంగారు బాండ్లను నిల్వ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది లాకర్ ఖర్చులను ఆదా చేస్తుంది. దొంగతనం జరిగే అవకాశం లేదు. బంగారం స్వచ్ఛత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నష్టం లేదా దొంగతనం ప్రమాదాన్ని తగ్గించడానికి, బాండ్లను డీమ్యాట్ ఖాతాలో ఉంచవచ్చు.
ఇప్పుడు మీరు సావరిన్ గోల్డ్ బాండ్‌ను ఎలా కొనుగోలు చేయవచ్చో చూద్దాం. గోల్డ్ బాండ్లను ప్రభుత్వ – ప్రైవేట్ బ్యాంక్ శాఖలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL) ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్యాంకుల వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ చెల్లింపు చేయడంపై గ్రాముకు రూ. 50 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. అయితే, డీమ్యాట్ ఎకౌంట్ లో ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు లేదా అమ్ముకోవచ్చు.
ఇప్పుడు SGBలో పొందే వడ్డీపై టాక్స్ గురించి ఆలోచిస్తున్నారా? సావరిన్ గోల్డ్ బాండ్ సంవత్సరానికి 2.5% వడ్డీని ఇస్తుంది. ఇది పెట్టుబడిదారుడి ఆదాయానికి యాడ్ అవుతుంది. మీ ఆదాయం పై ఎఫెక్ట్ అయ్యే స్లాబ్ ప్రకారం టాక్స్ విధిస్తారు. గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ వ్యవధి 8 సంవత్సరాలు. మెచ్యూరిటీపై వచ్చే డబ్బుకు పన్ను మినహాయింపు ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్‌లో, మెచ్యూరిటీకి ముందే డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. 5 సంవత్సరాల తర్వాత ప్రీ-మెచ్యూర్ రిడెంప్షన్ చేయవచ్చు.
5 సంవత్సరాల తర్వాత, రిజర్వ్ బ్యాంక్‌లో సావరిన్ గోల్డ్ బాండ్‌ను వెనక్కి తీసుకోవడం వలన వచ్చే లాభంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పన్ను – పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ చెప్పారు. మీరు బాండ్లను ట్రాన్స్ ఫర్ చేస్తే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఇది హోల్డింగ్ వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.
మీరు సావరిన్ గోల్డ్ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో విక్రయిస్తే మీరు హోల్డింగ్ వ్యవధి ప్రకారం అంటే ఆస్తిని కలిగి ఉన్న వ్యవధి ప్రకారం పన్ను చెల్లించాలి. హోల్డింగ్ వ్యవధి 3 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, గోల్డ్ బాండ్లను విక్రయించడం ద్వారా వచ్చే లాభం స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. లాభం మీ ఆదాయాలకు యాడ్ అవుతుంది. అప్పుడు స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. సావరిన్ గోల్డ్ బాండ్లను 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచిన తర్వాత వాటిని విక్రయించడం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభం పొందుతుంది. ఈ లాభం పై ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20% టాక్స్ విధిస్తారు. ఇండెక్సేషన్ ద్వారా, ఆస్తి కొనుగోలు ధర ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేస్తారు. ఇది కొనుగోలు ధరను పెంచుతుంది. లాభాలను తగ్గిస్తుంది. పన్ను బాధ్యతను తగ్గిస్తుంది. సురేష్ లాగా, మీ లక్ష్యం బంగారంలో మాత్రమే పెట్టుబడి పెట్టడం అయితే, మీరు సావరిన్ గోల్డ్ బాండ్‌ను చూడవచ్చు. దీనితో, మీ డబ్బు కాలక్రమేణా పెరుగుతుంది. మీకు వడ్డీ కూడా వస్తుంది. మీరు మెచ్యూరిటీ వ్యవధి వరకు ఉన్నట్లయితే, మీరు టాక్స్ లను కూడా ఆదా చేయవచ్చు. గోల్డ్ బాండ్లను స్టాక్ మార్కెట్‌లో వర్తకం చేస్తారు కాబట్టి, వాటిని సులభంగా విక్రయించవచ్చు. మీరు సావరిన్ గోల్డ్ బాండ్‌పై బ్యాంకు నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి