AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda Prologue EV: సింగిల్ చార్జ్‌పై 482 కి.మీ. హోండా నుంచి కొత్త ఎస్‌యూవీ.. లాంచింగ్ ఎప్పుడంటే..

వచ్చే మూడేళ్లలో టాప్ మోడళ్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు హోండా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వచ్చే ఏడాది ప్రారంభంలోనే తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపేరు హోండా ప్రోలాగ్. అయితే దీని లాంచింగ్ కన్నా చాలా ముందే ఈ కారుకు సంబంధించిన కీలక అప్ డేట్ ప్రకటించింది. అధికారిక ఈ కారు రేంజ్ తో పలు కీలక అంశాలను వెల్లడించేసింది.

Honda Prologue EV: సింగిల్ చార్జ్‌పై 482 కి.మీ. హోండా నుంచి కొత్త ఎస్‌యూవీ.. లాంచింగ్ ఎప్పుడంటే..
Honda Prologue Electric Suv
Madhu
| Edited By: |

Updated on: Oct 05, 2023 | 8:45 PM

Share

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా తన గేర్లను షిఫ్ట్ చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై తయారీపై ఫోకస్ పెట్టింది. విస్తృతంగా హోండా కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే మూడేళ్లలో టాప్ మోడళ్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వచ్చే ఏడాది ప్రారంభంలోనే తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపేరు హోండా ప్రోలాగ్. అయితే దీని లాంచింగ్ కన్నా చాలా ముందే ఈ కారుకు సంబంధించిన కీలక అప్ డేట్ ప్రకటించింది. అధికారిక ఈ కారు రేంజ్ తో పలు కీలక అంశాలను వెల్లడించేసింది. అంతేకాక దీని తర్వాత హోండా ఎలివేట్ ఎలక్ట్రిక్ వెర్షన్ ను కూడా లాంచ్ చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ హోండా ఈవీ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సింగిల్ చార్జ్ పై 482 కిలోమీటర్లు..

హోండా ఈ ఎస్ యూవీ లాంచింగ్ కన్నా ముందే దీని రేంజ్ ని ప్రకటించింది. ఈ ప్రోలాగ్ కారు సింగిల్ చార్జ్ పై ఏకంగా 482కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని పేర్కొంది. దీనిలో 85కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ మోటార్ లేదా డ్యూయల్ మోటార్ వస్తున్నా అన్ని విషయాన్ని అయితే ఇంకా ప్రకటించలేదు. అయితే ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో టాప్ వేరియంట్ గా ఇది లాంచ్ అవుతోంది. ఏడబ్ల్యూడీ వెర్షన్స్ అందుబాటులో ఉంటాయి. రెండు వెర్షన్లలోనూ 288బీహెచ్పీ, 451ఎన్ఎం గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తాయి.

సన్ రూఫ్‌తో ..

ఈ హోండా ప్రోలాగ్ కూడా ఇప్పటికే సంప్రదాయ ఇంజిన్ వెర్షన్లోని ఎలివేట్ లాగానే ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రోలాగ్ కారులో పానరోమిక్ రూఫ్ ఉంటుంది. 21 అంగుళాల వీల్స్ ఉంటాయి. ఈకారులో ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ డిజిటల్ 11 అంగుళాల డిస్ ప్లే ప్యానల్, 11.3 అంగుళాల ఆడియో, కనెక్టివిటీ డిస్ ప్లే ఉంటుంది. ఇన్ బిల్ట్ గా గూగుల్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉంటాయి. అడాస్ టెక్నాలజీని దీనిలో వినియోగించారు.  హెచ్​- మార్క్​ బ్యాడ్జ్​ ఉండనుంది. నార్త్​ షోర్​ పర్ల్​ రంగులో ఇది అందుబాటులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

లాంచింగ్ ఎప్పుడంటే..

హోండా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీగా గుర్తింపు పొందనున్న ఈ ప్రొలాగ్​.. లాంచ్​ డేట్​, పూర్తి ఫీచర్స్​, ధర వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే 2024 మొదట్లోనే దీనిని మార్కెట్లోకి ప్రవేశ పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!