30 ఏళ్లలో కోటీశ్వరులు కావాలంటే నెలకు ఎంత పొదుపు చేయాలి..! ఈ పథకం దీనికి సరిగ్గా సరిపోతుంది..
PPF Scheme : అసలే కరోనాకాలం.. ఆపై ఉంటుందో.. ఊడుతుందో.. అనుకునే ఉద్యోగాలు.. ఇలాంటి తరుణంలో డబ్బును పొదుపు
PPF Scheme : అసలే కరోనాకాలం.. ఆపై ఉంటుందో.. ఊడుతుందో.. అనుకునే ఉద్యోగాలు.. ఇలాంటి తరుణంలో డబ్బును పొదుపు చేయడం చాలా అవసరం. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే పథకాలు, ఫండ్స్ వైపు చాలామంది దృష్టి సారిస్తుంటారు. అయితే 30 ఏళ్లలో కోటీశ్వరులు కావాలనుకునే వ్యక్తులు నెలకు ఎంత పొదుపు చేయాలి.. ఎందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అనేది తెలిసుండాలి. మన డబ్బుకు ప్రభుత్వానికి మించిన సెక్యూరిటీ ఎవ్వరు ఇవ్వరు.. అలాంటి పెట్టుబడి మార్గాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) పథకం. 1968వ సంవత్సరంలో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ పీపీఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చిన్న చిన్న పొదుపులను లాభదాయకమైన పెట్టుబడిగా మార్చడం ఈ స్కీం ప్రత్యేకత. మీరు ఈ స్కీం మెచ్యూరిటీ కాలాన్ని తెలివిగా ఎంచుకుంటే, దీర్ఘకాలిక పీపీఎఫ్ చాలా మంచి రాబడిని ఇస్తుంది.
పీపీఎఫ్ ఖాతా నిబంధనల ప్రకారం.. సంవత్సరానికి పీపీఎఫ్ ఖాతాలో గరిష్ఠంగా 12 డిపాజిట్లు చేయవచ్చు. కాబట్టి, తక్కువ రిస్క్ తీసుకునేవారు, ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబడి చేయలేనివారు నెలకొకసారి మ్యూచువల్ ఫండ్ సిప్ మాదిరిగా వీలైనంత డిపాజిట్ చేయవచ్చు. అయితే, ప్రతి నెల 5వ తేదీలోగా పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సలహా ఇస్తారు, దాంతో ఖాతాదారుడు ఆ నెల వడ్డీని పొందవచ్చు.
ప్రతి నెల 5వ తేదీ లోపు పెట్టుబడిదారుడు నెలకు రూ.9,000 పెట్టుబడి పెడతాడని అనుకుంటే.. సంవత్సరానికి రూ.1,08,000 అవుతుంది. ఈ విధంగా పీపీఎఫ్ ఖాతాలో 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారనుకుంటే, సగటు పీపీఎఫ్ వడ్డీ రేటును ప్రస్తుతం ఉన్న 7.1 శాతంతో లెక్కిస్తే అది 30 ఏళ్లకు రూ.1,11,24,656లు అవుతుంది. దీంతో మీరు సులభంగా నెలకు తక్కువ మొత్తం పెట్టుబడితో కోటీశ్వరులు కావొచ్చు.
మీరు పీపీఎఫ్ స్కీమ్‌లో చేరడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. పెట్టిన డబ్బులు, వచ్చిన వడ్డీ, తీసుకునే డబ్బులపై పన్ను పడదు. పీపీఎఫ్ స్కీమలో చేరే వారు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. అలాగే వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌పై వడ్డీ రేట్లను మూడు నెలలకోసారి సమీక్షిస్తుంది. అంటే రేట్లు పెరగవచ్చు… లేదా తగ్గొచ్చు. ఇంకా స్థిరంగా కూడా కొనసాగవచ్చు కూడా.
Harwinder Kaur : ఆమె సంకల్పం ముందు ‘హైట్’ తలవంచింది..! లాయర్‌గా మారిన 3 అడుగుల యువతి..
Bajaj Electric Scooter : త్వరలో మార్కెట్‌లోకి ‘బజాజ్ చేతక్ స్కూటర్’..! హైదరాబాద్‌లో అమ్మకాలు..?
Kathi Mahesh : సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కత్తి మహేశ్..! ఆయన చివరి పోస్టులు ఇవే..