Garlic Farming : వెల్లుల్లి సాగుతో అధిక లాభాలు..! ఇలా చేస్తే మంచి దిగుబడి మీ సొంతం..

Garlic Farming : మన దేశంలో వెల్లుల్లిని ప్రధానంగా మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. అదే సమయంలో ఆయుర్వేద లక్షణాలతో నిండి

Garlic Farming : వెల్లుల్లి సాగుతో అధిక లాభాలు..! ఇలా చేస్తే మంచి దిగుబడి మీ సొంతం..
Garlic
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 11, 2021 | 8:25 AM

Garlic Farming : మన దేశంలో వెల్లుల్లిని ప్రధానంగా మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. అదే సమయంలో ఆయుర్వేద లక్షణాలతో నిండి ఉన్నందున ప్రజలు దీనిని ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడుతారు. భారతీయులు ప్రతిరోజూ వంటగదిలో వెల్లుల్లిని వివిధ రూపాల్లో ఉపయోగిస్తారు. ఈ కారణంగా దానికి డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే వ్యవసాయం చేస్తున్న రైతులు మంచి ఆదాయాన్ని పొందుతారు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఈ కారణంగా వెల్లుల్లి ఒక ప్రత్యేకమైన వాసనను వెదజల్లుతుంది. దాని రుచి తీవ్రంగా ఉంటుంది. అందుకే వెల్లుల్లిని మసాలాతో పాటు ఔషధంగా ఉపయోగిస్తారు. గొంతు, కడుపు వ్యాధుల నుంచి బయటపడటానికి ప్రజలు దీనిని వాడుతారు.

ఈ వ్యాధులలో వాడతారు దీనిని ఊరగాయ, కూరగాయలు, పచ్చడి, మసాలా దినుసులలో ఉపయోగిస్తారు. అధిక రక్తపోటు, కడుపు వ్యాధులు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, ఆర్థరైటిస్, నపుంసకత్వము, ఇతర వ్యాధులకు వెల్లుల్లిని ఉపయోగిస్తారు. యాంటీ బాక్టీరియల్, క్యాన్సర్ నిరోధక లక్షణాల కారణంగా దీనిని వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

ఈ విధంగా ఫీల్డ్‌ను సిద్ధం చేయండి.. వెల్లుల్లి పండించడానికి రైతు సోదరులు మొదట రెండు మూడు సార్లు పొలాన్ని బాగా దున్నాలి. ఆ తరువాత దానికి సరిపడ ఎరువు కలపాలి. ఒక హెక్టార్ పొలంలో 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, పొటాష్, సల్ఫర్ జోడించాలి. పొలంలో 100 కిలోల నత్రజనిని ఒకేసారి చల్లవద్దు. నాటు సమయంలో 35 కిలోలు, 30 రోజుల తర్వాత 35 కిలోలు, 45 రోజుల తర్వాత హెక్టారుకు 30 కిలోలు వాడాలి.

వెల్లుల్లి నాటే విధానం.. పొలాన్ని తయారు చేసి ఎరువు వేసిన తరువాత వెల్లుల్లి నాటాలి. వరుస నుంచి వరుస దూరం 15 సెం.మీ. ఉండాలి. మొక్క నుంచి మొక్కకు దూరాన్ని 10 సెం.మీ.లో ఉంచితే దిగుబడి బాగా వస్తుంది. నాటిన తరువాత చీడపీడలను నిరోధించడానికి పురుగుమందులు పిచికారీ చేయాలి. ఇందుకోసం ఒక లీటరు నీటిలో పెండమెథలిన్ 3.5 నుంచి 4 మి.లీ క్లెయిమ్ మొత్తాన్ని కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది.

Harwinder Kaur : ఆమె సంకల్పం ముందు ‘హైట్’ తలవంచింది..! లాయర్‌గా మారిన 3 అడుగుల యువతి..

Kathi Mahesh : సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కత్తి మహేశ్..! ఆయన చివరి పోస్టులు ఇవే..

Bajaj Electric Scooter : త్వరలో మార్కెట్‌లోకి ‘బజాజ్ చేతక్ స్కూటర్’..! హైదరాబాద్‌లో అమ్మకాలు..?