Home Purchase: మీరు పెట్టుబడి కోసం ఇల్లు కొంటుంటే ఈ ముఖ్యమైన సంగతి మాత్రం మరిచిపోవద్దు..
Real Estate: మీ వద్ద మిగులు ఫండ్స్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేందకు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి వ్యాపారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రియల్ ఎస్టేట్. గత కొన్ని దశాబ్దాలలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి..
మీ వద్ద మిగులు ఫండ్స్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేందకు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి వ్యాపారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రియల్ ఎస్టేట్. గత కొన్ని దశాబ్దాలలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది క్రేజ్ చూపిస్తున్నారు. పట్టణీకరణ ప్రక్రియ గణనీయంగా వేగవంతమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వేగంగా పెరిగింది. డిమాండ్ పెరుగుదల కారణంగా, ఇక్కడ మీ పెట్టుబడి చాలా వేగంగా పెరుగుతుంది. ఇది కాకుండా అద్దె ఆదాయం కూడా రావడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఇది డబుల్ లాభాల ఒప్పందం. ఈ ప్రయోజనాలను చూస్తే మీరు వాణిజ్య ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని కూడా ఆలోచిస్తుంటే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఇందులో ముఖ్యమైనది లొకేషన్, వాల్యుయేషన్, బిల్డింగ్ క్వాలిటీ, అద్దెదారు ప్రొఫైల్, మార్కెట్ డిమాండ్ వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
లొకేషన్ చాలా ముఖ్యమైన అంశం
బిజినెస్ కోసం లొకేషన్ చాలా ముఖ్యమైనది. ఆస్తి సరైన ప్రదేశంలో లేనట్లయితే మీకు రెగ్యులర్ అద్దె, ఆదాయం లభించదు. అంతే కాకుండా కనెక్టివిటీ సౌకర్యం కూడా బాగుండాలి. మీరు అక్కడ దుకాణం తెరవాలనుకున్నా.. లేదా అద్దెకు ఇవ్వాలనుకున్నా.. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బిజినెస్ మొదలు పెట్టాలి.
వాల్యుయేషన్ చాలా ముఖ్యం
లెక్కింపు (వాల్యుయేషన్) చాలా ముఖ్యం. మనం పెట్టబడి పెట్టనున్న ఆస్తిపై మొదట వాల్యుయేషన్ చేసుకోవాలి. మీరు సరైన వాల్యుయేషన్‌లో ఆస్తిని తీసుకోకపోతే అది మీకు నష్టంగా మారే ఛాన్స్ ఉంది. నిర్మాణ నాణ్యత కూడా ఒక ముఖ్యమైన అంశం. మీరు మంచి అద్దెదారులను పొందాలనుకుంటే భవనంకు మంచి నాణ్యత అవసరం. మంచి అద్దెదారు ఎక్కువ కాలం లీజుకు తీసుకుంటాడు.
ఆస్తి నాణ్యత సరిగా లేకుంటే అద్దె కూడా తక్కువగా వస్తుంది. లీజు వ్యవధి కూడా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు నిరంతరం అద్దెదారులను వెతకాల్సి ఉంటుంది. అన్ని అంశాలను లెక్కలోకి తీసుకుని మీరు పెట్టబడి పెడితే దానిపై రాబడి కూడా అలానే ఉంటుంది.
ఇవి కూడా చదవండి: India Pakistan, T20 World Cup LIVE Streaming: బిగ్ సండే.. బిగ్ ఫైట్.. మ్యాచ్ ఎక్కడ, ఎలా చూడాలో తెలుసా..
Ind Vs Pak: భారత్-పాకిస్తాన్ ఫైట్‌కు ముందు అభిమానుల గొడవ.. టీవీలు పగులుతాయ్.. అనడంతో రచ్చ..