Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..! దీపావళి బోనస్.. స్పెషల్ ఇంక్రిమెంట్లు

Diwali Bonus: రెండు రోజుల క్రితమే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచింది. తాజాగా మరో శుభవార్త ప్రకటించింది. కొంతమంది ఉద్యోగులకు వేతనాలపై

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..! దీపావళి బోనస్.. స్పెషల్ ఇంక్రిమెంట్లు
Rupee6
Follow us
uppula Raju

|

Updated on: Oct 24, 2021 | 5:13 PM

Diwali Bonus: రెండు రోజుల క్రితమే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచింది. తాజాగా మరో శుభవార్త ప్రకటించింది. కొంతమంది ఉద్యోగులకు వేతనాలపై ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పెంపుతో ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఈ ఇంక్రిమెంట్ ప్రయోజనం 7వ పే కమిషన్ పే మ్యాట్రిక్స్ కి సంబంధించి 6 వ స్థాయి అధికారులకు కేటాయించారు. ఈ ర్యాంక్ ఉన్న అధికారుల జీతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. జీతం పెరిగిన అధికారులు మిలటరీ అర్రైర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. మీడియా నివేదిక ప్రకారం.. లెవెల్ 5A, లెవెల్ 10A, లెవెల్ 10B, లెవెల్ 12A, లెవెల్ 12B , లెవెల్ 13B అధికారులు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రయోజనం పొందుతారు. ఈ అధికారుల వ్యక్తిగత చెల్లింపులను ప్రభుత్వం పెంచింది.

ఎవరు ప్రయోజనం పొందుతారు ఈ ఇంక్రిమెంట్ ప్రయోజనం అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలలో పాల్గొనే అధికారులకు ఇస్తారు. ఈ అధికారులను ప్రత్యేక ఇంక్రిమెంట్ కోసం ఎంపిక చేశారు. చాలా కాలంగా ఈ సమస్య రక్షణ మంత్రిత్వ శాఖతో పరిశీలనలో ఉంది. ప్రస్తుతం దీనిని మంత్రిత్వ శాఖ ఆమోదించింది అధికారుల ప్రత్యేక ఇంక్రిమెంట్‌కు మార్గం సుగమం చేసింది.

జీతం ఎంత పెరుగుతుంది రక్షణ శాఖలోని ఈ అధికారుల వేతనాలలో ప్రత్యేక ఇంక్రిమెంట్ జూలై 1, 2017 నుంచి అమలు చేయాలి. అంటే మునుపటి తేదీ నుంచి జోడిస్తే పెద్ద మొత్తం డబ్బు అధికారులకు ఇస్తారు. దీపావళి నాడు అధికారులకు భారీగా జీతాలు అందుతాయి. లెవల్ 5ఏ ఆఫీసర్ల జీతం రూ.570, లెవల్ 10ఏ ఆఫీసర్ల జీతం రూ.1240, లెవల్ 10బీ ఆఫీసర్ల జీతం రూ.1240, లెవల్ 12ఏ ఉద్యోగులు రూ.1690, లెవల్ 12బీ ఉద్యోగులు రూ.1690గా ఉండనుంది.

ఇటీవల కరువు భత్యం పెంచింది అక్టోబర్ 21న ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచుతూ పెద్ద నిర్ణయం తీసుకుంది. కానీ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దానిని మరోసారి 3 శాతానికి పెంచింది. ఇంతకు ముందు డియర్నెస్ అలవెన్స్ రేటు 28 శాతంగా ఉంది. ఇది 31 శాతానికి పెరిగింది. 1 కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు ఈ పెంపుదల ప్రయోజనం పొందుతారు.

Police Video: సాహస పోలీస్‌.. నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని ఎలా కాపాడాడో చూడండి..

T20 World Cup 2021, IND vs PAK: టీమిండియా దెబ్బకు మానసిక ఒత్తిడిలో పాకిస్తాన్..!

Trailer Talk: నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్న ఎనిమి ట్రైలర్.. విశాల్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా..