Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Video: సాహస పోలీస్‌.. నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని ఎలా కాపాడాడో చూడండి..

Police Video: ప్రతిరోజు చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఈ వీడియోలను నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంతో సమాచారాన్ని కూడా

Police Video: సాహస పోలీస్‌.. నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని ఎలా కాపాడాడో చూడండి..
Police Video
Follow us
uppula Raju

|

Updated on: Oct 24, 2021 | 4:18 PM

Police Video: ప్రతిరోజు చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఈ వీడియోలను నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంతో సమాచారాన్ని కూడా తెలుసుకుంటారు. షేర్స్, కామెంట్స్‌ చేస్తూ సందడి చేస్తారు. చాలాసార్లు మీరు పోలీసుల వీడియోలను చూసి ఉంటారు. కానీ అందులో కొన్ని మంచివి, మరికొన్ని చెడు వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా ఒక పోలీస్ బాలుడిని కాపాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోను తెగ లైక్‌ చేస్తున్నారు. పదే పదే చూస్తున్నారు.

వీడియోలో ఓ పోలీస్‌ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్నారి ప్రాణాలను కాపాడటం మనం గమనించవచ్చు. అతడి ప్రాణాలను లెక్కచేయకుండా నీటిలోకి దూకి బాలుడిని ఒడ్డుకు చేర్చడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సాహస పోలీస్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చాలా ధైర్యం కలిగిన పోలీసని పొగడుతున్నారు.

ఈ వీడియో సచిన్ కౌశిక్ పేజీ అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. వీడియోను షేర్ చేస్తూ ‘లోతైన నీటిలో మునిగిపోతున్న చిన్నారిని బయటకు తీశాడు. అశోక్ భాయ్ హ్యాట్సాప్ అంటూ కామెంట్’ పెట్టాడు. అంతేకాదు అధికారుల నుంచి 10 వేల రూపాయల బహుమతి అందుతుందని తెలిపాడు. ఈ సాహస పోలీస్‌ పేరు అశోక్ యాదవ్. ఇతడు సీతాపూర్‌లో ఉంటున్నాడు. బాలుడిని కాపాడిన తీరుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

IND vs PAK LIVE Score, T20 World Cup 2021: దుబాయ్‌లో సరికొత్త రికార్డుపై కన్నేసిన కోహ్లీసేన..!

12 ఏళ్ల బాలిక తండ్రిని దారుణంగా చంపేసింది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..