AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trailer Talk: నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్న ఎనిమి ట్రైలర్.. విశాల్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా..

యాక్షన్ హీరో విశాల్‏కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తను నటించిన తమిళ్ చిత్రాలు తెలుగులో

Trailer Talk: నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్న ఎనిమి ట్రైలర్.. విశాల్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా..
Enemy
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2021 | 4:00 PM

Share

యాక్షన్ హీరో విశాల్‏కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తను నటించిన తమిళ్ చిత్రాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగులో విశాల్‏కు అభిమానులు ఎక్కువే ఉన్నారు.. ఆయన సినిమాలకు తెలుగులో ఆదరణ ఎక్కువే ఉంది. తాజాగా మో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. యాక్షన్ హీరో విశాల్.. మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు వీడు తరువాత మరోసారి ఎనిమీ అంటూ ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ ఎనిమి సినిమా విశాల్‌కు 30, ఆర్యకు 32వ సినిమా కావడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 100 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో సినిమా ఎలా ఉండోబోతోందో చూపించారు. బరిలోకి దిగితే మీ ఇద్దరు శత్రువులు.. ఆ తరువాత మిత్రులు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో అర్థమైంది. అయితే ఆర్య విశాల్‌కు ఎందుకు శత్రువుగా మారాల్సి వచ్చింది? అనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ట్రైలర్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ ఫేమ్ మిర్నాలిని రవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది.. యూట్యూబ్‏లో ఎనిమి ట్రైలర్ మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత విశాల్ సినిమా తెలుగులో విడుదల కాబోతుండగా.. ఇప్పటికీ విశాల్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.. ఈ చిత్రానికి ఆర్‌డీ రాజశేఖర్ కెమెరామెన్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

ట్రైలర్..

Also Read: RajiniKanth: అక్టోబర్ 25న రజినీకి ప్రత్యేకం.. తన జీవితంలో రేపు స్పెషల్ అంటున్న తలైవా.. ఎందుకంటే..

Charmi: ఇక నటించే ఆలోచన మాత్రం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన చార్మి..

Follow Us
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక గురించి మీకు ఎంత తెలుసు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక గురించి మీకు ఎంత తెలుసు?
సినిమా ఆశ చూపి హత్యలు.. రియల్ స్టోరీతో తెరకెక్కిన మూవీ..
సినిమా ఆశ చూపి హత్యలు.. రియల్ స్టోరీతో తెరకెక్కిన మూవీ..
వేడి వల్ల తలనొప్పి వస్తోందా? వెంటనే ఉపశమనం కలిగించే ఈజీ చిట్కాలు
వేడి వల్ల తలనొప్పి వస్తోందా? వెంటనే ఉపశమనం కలిగించే ఈజీ చిట్కాలు
మద్యానికి బానిసై.. ఇండస్ట్రీకి దూరమై..
మద్యానికి బానిసై.. ఇండస్ట్రీకి దూరమై..
బాలింతలకు సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు?దీని వెనుక ఉన్న కారణాలివే
బాలింతలకు సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు?దీని వెనుక ఉన్న కారణాలివే
ఆక్వా రంగంపై అర్నబ్ ఎఫెక్ట్.. కన్నీరుమున్నీరవుతున్న రొయ్యల రైతులు
ఆక్వా రంగంపై అర్నబ్ ఎఫెక్ట్.. కన్నీరుమున్నీరవుతున్న రొయ్యల రైతులు
స్వచ్చమైన వెండిని గుర్తించడం ఎలా..? ఈ సింపుల్ విషయం తెలిస్తే చాలు
స్వచ్చమైన వెండిని గుర్తించడం ఎలా..? ఈ సింపుల్ విషయం తెలిస్తే చాలు
నాకు చెప్పిన కథ ఒకటి.. తీసింది మరోకటి.!
నాకు చెప్పిన కథ ఒకటి.. తీసింది మరోకటి.!
చెట్టినాడు స్టైల్ ఉల్లిపాయ రసం.. ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు
చెట్టినాడు స్టైల్ ఉల్లిపాయ రసం.. ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు
ఎంబీబీఎస్: తొలి ఏడాది నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్, పీజీ కోచింగ్..
ఎంబీబీఎస్: తొలి ఏడాది నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్, పీజీ కోచింగ్..