Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charmi: ఇక నటించే ఆలోచన మాత్రం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన చార్మి..

అతి తక్కువ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది హీరోయిన్ చార్మి.. స్టార్ హీరోస్

Charmi: ఇక నటించే ఆలోచన మాత్రం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన చార్మి..
Charmy
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 24, 2021 | 2:53 PM

అతి తక్కువ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది హీరోయిన్ చార్మి.. స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ.. ఇప్పుడు నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు కేవలం సినిమాలను నిర్మించే పనిలో మాత్రమే నిమగ్నమైంది.. చాలా కాలంగా నటనకు దూరంగా ఉంటూ వస్తుంది. హీరోయిన్‏గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలోనే.. నటనకు స్వస్తి చెప్పి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది చార్మి.. ఇక ఆ తర్వాత.. పూర్తిగా నటనకు దూరంగా ఉండిపోయింది…

ఇదిలా ఉంటే.. తాజాగా తనకు నటించాలని లేదంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది చార్మి.. తాజా ఇంటర్వ్యూలో ఈ పంజాబీ బ్యూటీ మాట్లాడుతూ.. హీరోయిన్‏గా ఉండటంలోనే ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. ఫిట్ నెస్ పై మాత్రమే దృష్టి పెడితే సరిపోతుంది. నిర్మాతగా బాధ్యతలను స్వీకరించడం మాత్రం అంత తేలికైన విషయం కాదు.. అప్పుడు అందరి కంఫర్టును చూడవలసి ఉంటుంది.. హీరోయిన్‏గా ఉన్నప్పుడు నా పని వరకూ నేను చూసుకుంటే సరిపోయేది.. కానీ నిర్మాతగా మారిన తర్వాత అలా కుదరదు.. అందరి పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నాకు విసుగు రావట్లేదు.. నటిగా నాకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇక నటించే ఆలోచన మాత్రం లేదు అని చెప్పుకొచ్చింది చార్మి.. ప్రస్తుతం ఈ పంజాబీ బ్యూటీ… విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లైగర్ చిత్రాన్ని నిర్మిస్తోంది.. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య హీరోయిన్‏గా నటిస్తోంది.

Also Read: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

F3 Movie: ‘బొమ్మ ఎప్పుడు పడితే..అప్పుడే మనకు నవ్వుల పండగ’.. ‘ఎఫ్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్

Bigg Boss 5 Telugu: ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా.. ఇది నిజంగా ఊహించని షాక్..