Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RajiniKanth: అక్టోబర్ 25న రజినీకి ప్రత్యేకం.. తన జీవితంలో రేపు స్పెషల్ అంటున్న తలైవా.. ఎందుకంటే..

సూపర్ స్టార్ రజినీ కాంత్‏కు రేపు (అక్టోబర్ 25) చాలా స్పెషల్ అని తెలిపారు.. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్

RajiniKanth: అక్టోబర్ 25న రజినీకి ప్రత్యేకం.. తన జీవితంలో రేపు స్పెషల్ అంటున్న తలైవా.. ఎందుకంటే..
Rajinikanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 24, 2021 | 3:34 PM

సూపర్ స్టార్ రజినీ కాంత్‏కు రేపు (అక్టోబర్ 25) చాలా స్పెషల్ అని తెలిపారు.. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ రజినీ కాంత్‏ను వరించిన సంగతి తెలిసిందే. కేవలం హీరోగానే కాకుండానే.. నిర్మాతగానూ.. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు రజినీ కాంత్.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే తలైవాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ రావడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు రజినీ.. ఈ సందర్భంగా.. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలైవా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

రజినీ కాంత్ మాట్లాడుతూ.. రేపు (అక్టోబర్ 25) నా జీవితంలో చాలా స్పెషల్.. నాకు రెండు ప్రత్యేక ల్యాండ్ మార్కులతో కూడిన ముఖ్యమైన సందర్భం.. ఒకటి దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ రావడం.. ప్రజల ప్రేమ.. మద్దతు కారణంగానే నాకు భారత ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రదానం చేస్తుంది.. ఇక రెండవది… నా కూతురు సౌందర్య విశాగన్ తను సొంతంగా రూపొందించిన Hoote యాప్ ప్రారంభించబోతుంది. ఇందులో ప్రజలు వారి వాయిస్ ద్వారా ఆలోచనలను పంచుకోవచ్చు.. ఈ యాప్‏ను నా వాయిస్‏తో ప్రారంభించడం మరింత సంతోషంగా ఉంది..అంటూ చెప్పుకొచ్చారు.. అలాగే ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు.

ట్వీట్..

ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, రజనీకాంత్ 2019కి 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నట్లు ప్రకటించారు. ఇక రేపు రజినీ కాంత్ అవార్డు అందుకోవడానికి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు..

Also Read: Chiranjeevi: అనారోగ్యంతో ఉన్న తన అభిమాన దంపతుల్ని ఫ్లైట్‌లో రప్పించిన చిరు.. తర్వాత?

Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Sreemukhi: పట్టు పరికినిలో యాంకర్ శ్రీముఖి.. ఆకట్టుకుంటున్న యాంకర్ ఫొటోస్…