Honda 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌కు పోటీగా హోండా నయా బైక్.. స్టన్నింగ్ ఫీచర్లతో సరికొత్త లుక్..
తాజాగా ప్రముఖ కంపెనీ హోండా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌కు పోటీగా మరో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఫీచర్లపరంగా ఎలాంటి వ్యత్యాసం లేకపోయినా చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చింది. హోండా సీబీ 350 పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ రెండు వేరియంట్లల్లో అందుబాటులో ఉంటుంది. హోండా సీబీ 350కు సంబంధించిన మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

భారతదేశంలో బైక్‌ల వాడకంప విపరీతంగా పెరిగింది. సాధారణంగా భారతదేశంలో యువత ఎక్కువ. ఇటీవల యువత ఎక్కువగా బైక్‌లను వాడడానికి ఇష్టపడుతున్నారు. కంపెనీలు కూడా వారిని ఆకట్టుకోవడానికి కొత్త కొత్త బైక్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఎన్నికంపెనీల బైక్‌లు ఉన్నా యువత రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ఉన్న క్రేజ్ వేరు. అయితే ఇతర కంపెనీలు కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా కొత్త తరహా బైక్‌లను రిలీజ్ చేసి యువతను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హోండా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌కు పోటీగా మరో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఫీచర్లపరంగా ఎలాంటి వ్యత్యాసం లేకపోయినా చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చింది. హోండా సీబీ 350 పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ రెండు వేరియంట్లల్లో అందుబాటులో ఉంటుంది. హోండా సీబీ 350కు సంబంధించిన మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
హోండా సీబీ 350కు జతగా రెండు వేరియంట్స్‌లో రిలీజ్ చేశారు. హోండా సీబీ 350తో పాటు హెచ్ నెస్ 350, హెచ్‌నెస్ 350 ఆర్‌ఎస్ వేరియంట్స్‌లో బైక్ లవర్స్ కొనుగోలు చేయవచ్చు. హోండా సీబీ 350 ప్రారంభం ధర రూ.1,99,900గా ఉంది. సాధారణ సీబీ 350 రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అంటే డీఎల్‌ఎక్స్‌తో డీఎల్‌ఎక్స్ ప్రో. ఈ రెండు బైక్‌లు రూ.2.18 లక్షల వద్ద కొనుగోలు చేయవచ్చు. హోండా సీబీ 350 348.36 సీసీ, ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 5500 ఆర్‌పీఎం వద్ద 20.04 బీహెచ్‌పీ, 3000 ఆర్‌పీఎం వద్ద 29.4 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హెచ్ నెస్ 350, హెచ్‌నెస్ 350 ఆర్‌ఎస్ 30 ఎన్‌ఎంతో పోలిస్తే రెండోది 0.6 ఎన్‌ఎం స్వల్ప తగ్గుదలను సూచిస్తుంది. ఇంజిన్ 5- స్పీడ్ గేర్‌బాక్స్‌తో అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో పాటు హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌తో జత చేశారు. ముఖ్యంగా రెట్రో స్టైలింగ్‌తో వస్తున్న సీబీ 350 కొత్త వెర్షన్లు హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్‌తో పని చేస్తుంది. అలాగే హెరిటేజ్ ప్రేరేపిత డిజిటల్ అన్‌లాగ్ ఇనుస్ట్రమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, క్రస్ట్ మెటాలిక్, మార్షల్ గ్రీన్, మాట్ డ్యూన్ బ్రౌన్ రంగుల్లో అందుబాటులో ఉంది. అయితే హోండా రిలీజ్ చేసిన ఈ రెండు మోడల్స్ బైక్‌లు యువతను ఏ మాత్రం ఆకట్టుకుంటాయో? చూడాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







