Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda 350 CC Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్‌కు పోటీగా హోండా నుంచి కొత్త బైక్.. ఆ బైక్స్‌కు కొనసాగింపుగా..

మిడిల్ క్లాస్ కస్టమర్స్‌తో పాటు ఉన్నత వర్గాలను ఆకట్టకుంటానికి కూడా హోండా కొత్త బైక్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. 350 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్‌ను ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కు పోటీగా నిలపాలి అని అనుకుంటుంది. ఇటీవల నిర్వహించిన ఈవీ లైనప్ ఈవెంట్‌లో ఈ సరికొత్త ఆవిష్కరణ గురించి వెల్లడైంది.

Honda 350 CC Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్‌కు పోటీగా హోండా నుంచి కొత్త బైక్.. ఆ బైక్స్‌కు కొనసాగింపుగా..
Honda 350
Follow us
Srinu

|

Updated on: Apr 01, 2023 | 3:00 PM

సాధారణంగా హోండా బైక్స్ అంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అందుబాటు ధరల్లో అధిక ఫీచర్లతో ఎక్కువ రోజులు మన్నికతో వచ్చే ఈ బైక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. హోండా యాక్టివా ఇప్పటికీ స్కూటర్ రేంజ్‌లో రారాజుగానే ఉంది. అయితే మిడిల్ క్లాస్ కస్టమర్స్‌తో పాటు ఉన్నత వర్గాలను ఆకట్టకుంటానికి కూడా హోండా కొత్త బైక్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. 350 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్‌ను ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కు పోటీగా నిలపాలి అని అనుకుంటుంది. ఇటీవల నిర్వహించిన ఈవీ లైనప్ ఈవెంట్‌లో ఈ సరికొత్త ఆవిష్కరణ గురించి వెల్లడైంది. ఇప్పటికే కంపెనీ సీబీ 350, సీబీ 350 ఆర్ఎస్ మోడల్స్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఎప్పుడైతే మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వచ్చిందో? అప్పటి నుంచే ఈ బైక్స్‌కు డిమాండ్ తగ్గిపోయింది. భారత మార్కెట్ మరింత వాటాను పొందడానికి ప్రస్తుతం ఉన్న 350 సీసీ బైక్స్‌ను అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనతో హోండా కంపెనీ ఉన్నట్లు మార్కెట్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. 

హోండా డీలర్లు చెబుతున్న దాని ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 లాంచ్ అయిన దగ్గర నుంచి సీబీ 350 సేల్స్ విషయంలో గట్టి పోటీను ఎదుర్కొంటుంది. దీంతో సీబీ 350 ఫుట్‌ఫాల్ గణనీయంగా పడిపోయింది. గత కొద్దిరోజులుగా సీబీ 350కు డిమాండ్ పడిపోయింది. ప్రస్తుతం హోండా సీబీ 350 ప్లాట్‌ఫారమ్ సరసమైన వెర్షన్‌ను అభివృద్ధి చేసి ప్రారంభించాలనుకుంటోంది. ప్రస్తుతం, బిగ్ వింగ్ డీలర్లు సీబీ 350 శ్రేణి నుంచి తమ అమ్మకాలను ఎక్కువగా పొందుతున్నారు అలాగే అమ్మకాల పరిమాణంలో తగ్గుదల వారిని దెబ్బతీస్తుంది. ప్రస్తుతం, సీబీ 350 ధర రూ. 2.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 దాదాపు రూ.70,000 చౌకగా రావడంతో కొనుగోలుదారులు దీన్ని కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం హోండా రిలీజ్ చేద్దామనుకుంటున్న కొత్త బైక్ ఫీచర్లు, కానీ ధర కానీ ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..