Vaginal Care: యోని నుంచి దుర్వాసన వస్తుందా.. ఈ చిట్కాలు పాటిస్తే వాసన దూరమవుతుంది!
ప్రైవేట్ పార్ట్స్ విషయంలో చాలా మంది సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ మొదట్లో పట్టించుకోక పోతే ఆ తర్వాత దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతాయి. కొంత మందికి యోని నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అంతర్లీన అనారోగ్య సమస్యల కారణంగా ఈ వాసన అనేది వస్తూ ఉంటుంది. అలాగనే మార్కెట్లో దొరికే ప్రాడెక్ట్స్ ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినా స్మెల్ మాత్రం పోదు. నిజానికి యోని నుంచి ఇలా దుర్వాసన రావడానికి అనేక కారణాలు..
ప్రైవేట్ పార్ట్స్ విషయంలో చాలా మంది సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ మొదట్లో పట్టించుకోక పోతే ఆ తర్వాత దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతాయి. కొంత మందికి యోని నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అంతర్లీన అనారోగ్య సమస్యల కారణంగా ఈ వాసన అనేది వస్తూ ఉంటుంది. అలాగనే మార్కెట్లో దొరికే ప్రాడెక్ట్స్ ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినా స్మెల్ మాత్రం పోదు. నిజానికి యోని నుంచి ఇలా దుర్వాసన రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యోని నుంచి వాసన ఎందుకు వస్తుంది:
పీహెచ్ స్థాయిలు ఇన్ బ్యాలెన్స్ అవ్వడం, అంటు వ్యాధుల వలన, లేదా అంతర్గత కొన్ని సమస్యల వలన కూడా యోని నుంచి వాసన వస్తూ ఉంటుంది. యోని నుంచి చాలా కాలంగా వాసన వస్తూ, దురద, మంట, నొప్పి, భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి ఉంటే మాత్రం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లడం మంచిది.
వాసనకు కారణం ఏంటి?
యోని పరిశుభ్రత లేకపోవడం, హార్మోన్ల మార్పులు, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల మందులు, బ్యాక్టీరియల్ వాగినోసిస్ లేదా ట్రైకోమోనియాసిస్ వంటి అంటు వ్యాధుల కారణంగా యోని నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది.
పరిశుభ్రత ముఖ్యం:
సాధారణంగా యోని ప్రాంతంలో చెమట అనేది పడుతూ ఉంటుంది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్, దుమ్ము కణాలు ఇలా చేరుతూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ గా స్నానం చేసేటప్పుడు యోనిని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే లో దుస్తులు కూడా ప్రతి రోజూ మార్చుకోవాలి.
డౌచింగ్ చేయకూడదు:
డౌచింగ్ అంటే నీరు లేదా ఇతర ద్రవాలతో యోని లోపల కడుతూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇది పీహెచ్ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. ఇలా చేయడం వల్ల ఈస్ట్ ఇన్ ఫెక్షన్, బ్యాక్టీరియల్ వాగినోసస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
ప్రోబయోటిక్స్ ఫుడ్ తీసుకోండి:
యోని నుంచి దుర్వాసనను తగ్గించడంలో ప్రోబయోటిక్స్ ఆహారాలు మంచి చేస్తాయి. పెరుగు లేదా పులియబెట్టిన ఆహార పదార్థాలు తినడం వల్ల యోని నుంచి మంచి వాసన వచ్చేలా చేస్తాయి. అంతే కాకుండా యోనిలోని ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుతుంది. అంటు వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మీరు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు కండోమ్ ధరించడం వల్ల లైంగిక సంక్రమణ వ్యాధులు, లైంగిక సంక్రమణ ఇన్ ఫెక్షన్ లకు దూరంగా ఉంటారు. కానీ వీటితో కూడా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.