AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణం రద్దయ్యిందా.. మీ రైలు టికెట్‌ను వేరొకరికి బదిలీ చేసేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

మీరు ఏదైనా ఊరు వెళ్లడానికి రైలు టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి.. అది కన్ఫార్మ్ కూడా అయ్యింది. అయితే ప్రయాణానికి ముందు అత్యవసర పని పడి మీరు ఊరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ టికెట్ ను ఏమి చేయాలి? క్యాన్సిల్ చేసుకోవాలి. కానీ దానికి చార్జీలు పడతాయి. అందువల్ల ప్రయాణికుడు నష్టపోయే అవకాశం ఉంది. అలా కాకుండా మరేదైనా మార్గం ఉందా?

Indian Railways: ప్రయాణం రద్దయ్యిందా.. మీ రైలు టికెట్‌ను వేరొకరికి బదిలీ చేసేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
Train Ticket
Madhu
|

Updated on: Mar 08, 2024 | 6:22 AM

Share

మీరు ఏదైనా ఊరు వెళ్లడానికి రైలు టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి.. అది కన్ఫార్మ్ కూడా అయ్యింది. అయితే ప్రయాణానికి ముందు అత్యవసర పని పడి మీరు ఊరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ టికెట్ ను ఏమి చేయాలి? క్యాన్సిల్ చేసుకోవాలి. కానీ దానికి చార్జీలు పడతాయి. అందువల్ల ప్రయాణికుడు నష్టపోయే అవకాశం ఉంది. అలా కాకుండా మరేదైనా మార్గం ఉందా? ఆ టికెట్ ను వేరే వాళ్లకు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉందా? మన బదులు ఆ టికెట్ పై వేరే వాళ్లు ప్రయాణం చేయవచ్చా? రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి? ఒకవేళ ఆ విధానం ఉంటే ఎలా బదిలీ చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రైల్వే టికెట్ బదిలీ..

ఒక ప్రయాణికుడు పొందిన టికెట్ ను మరొకరికి బదిలీ చేయడానికి వీలుగా భారతీయ రైల్వే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనివల్ల ప్రయాణికుడు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటుంది. ఆ టికెట్ పై వేరొకరిని పంపించే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు ఊరు వెళ్లడం తప్పనిసరి అయినప్పుడు మీ బదులు భార్య, ఇతర కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ టికెట్ ను బదిలీ చేసి, వారిని పంపించవచ్చు.

కుటుంబ సభ్యులకు చేసే అవకాశం..

ఎవరైనా రిజర్వేషన్ కన్ఫార్మ్ టికెట్‌ని కలిగి ఉండి, ఏ కారణం చేతనైనా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడితే ఆ టికెట్ ను కుటుంబ సభ్యుడికి బదిలీ చేయవచ్చు. అయితే బదిలీ అనేది అతడి కుటుంబ సభ్యుడికి మాత్రమే చేయాలి. తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, కుమార్తె, కుమారుడు, భర్త, భార్యకు చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. బయట వారికి చేయడం సాధ్యం కాదు. తద్వారా ప్రయాణికుడి డబ్బులు ఆదా అవుతాయి. వారి కుటుంబానికి కూడా ప్రయోజనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఒక్కసారి మాత్రమే..

ఈ సేవను పొందేందుకు ప్రయాణికులందరికీ అవకాశం ఉంది. అయితే కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు అభ్యర్థనను అందజేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, టికెట్ బదిలీకి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటికే ఎవరికైనా టికెట్‌ను బదిలీ చేసినట్లయితే, మళ్లీ రెండోసారి చేయడానికి వీలు ఉండదు.

మార్గదర్శకాలు..

టిక్కెట్ ను వేరొకరికి బదిలీ చేయడానికి భారతీయ రైల్వే కొన్ని మార్గదర్శకాలను సూచించింది. వాటిని పాటిస్తే ఈ ప్రక్రియను చాలా సులభమవుతుంది.

  • ముందుగా మీ పేరు మీద కన్ఫార్మ్ అయిన టికెట్ ప్రింట్ ను తీసుకోవాలి.
  • మీరు టిక్కెట్ ను బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆధార్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డు కూడా అవసరం అవుతాయి.
  • మీ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ లోని రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లండి.
  • టిక్కెట్ బదిలీ కోసం దరఖాస్తు చేయండి.
  • రైలు బయలుదేరే సమయానికి కనీసం 24 గంటల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.

గమనించాల్సిన ముఖ్య అంశాలు..

టికెట్ బదిలీ చేయాలనుకున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే రైలు బయలు దేరే సమయానికి 24 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే పండుగలు, వివాహాలు, వ్యక్తిగత సమస్యలపై వెళ్లేవారు మాత్రం ప్రయాణానికి 48 గంటల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఎన్ సీసీ అభ్యర్థులు కూడా టికెట్ బదిలీ సేవ ప్రయోజనాలు పొందవచ్చు. అయితే వారు తమ గుర్తింపు కార్డులను కౌంటర్ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..