AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar electric car: వారెవ్వా.. ఎవా! మతిపోగొడుతున్న సోలార్ ఎలక్ట్రిక్ కార్.. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 250 కిలోమీటర్లు..

పూణేకు చెందిన స్టార్టప్ కంపెనీ వేవ్ మొబిలిటీ దేశంలోని మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారును ఎవా పేరుతో ఆవిష్కరించింది. బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్‌తో కారు పూర్తిగా ఆటోమేటిక్‌గా కంట్రోల్స్ దీని సొంతం.

Solar electric car: వారెవ్వా.. ఎవా! మతిపోగొడుతున్న సోలార్ ఎలక్ట్రిక్ కార్.. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 250 కిలోమీటర్లు..
Solar Car Eva
Madhu
|

Updated on: Feb 05, 2023 | 7:00 PM

Share

ప్రస్తుతం అంతా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల గురించే చర్చ. ఆటో మొబైల్ రంగం కొత్త తరహా ఎలక్ట్రిక్ వాహనాల బాట పడుతోంది. మార్కెట్లో ఈ తరహా వాహనాలకు విపరీతమైన పోటీ ఉంది. అయితే పూణేకు చెందిన ఓ స్టార్టప్ మరో అడుగు ముందుకేసింది. దేశంలోనే మొట్టమొదటి సోలార్ కార్ ను ఆవిష్కరించింది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సోలార్ పవర్ తో పాటు దీనిలోని బ్యాటరీ విద్యుత్ తో కూడా చార్జ్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. ఆ కంపెనీ ఏంటి? ఆ కారు విశేషాలు ఏంటి? దాని ఫీచర్లు, రేంజ్ వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎవా పేరుతో లాంచ్..

పూణేకు చెందిన స్టార్టప్ కంపెనీ వేవ్ మొబిలిటీ దేశంలోని మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారును ఎవా పేరుతో ఆవిష్కరించింది. బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్‌తో కారు పూర్తిగా ఆటోమేటిక్‌గా కంట్రోల్స్ దీని సొంతం. అలాగే ఒక యూనిట్ విద్యుత్‌ తో దాదాపు 20 కి.మీ వెళ్లగలదని తయారీదారులు పేర్కొంటున్నారు. ఈ రంగంలో ఇదే అత్యధికమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారు టైర్ I, టైర్ II , టైర్ III నగరాలతో సహా రద్దీగా ఉండే నగరాల్లో సౌకర్యవంతంగా ప్రయాణించడానికి మినీ సైజ్ లో రూపొందించారు. పరిమాణంలో చిన్నదిగా ఉన్నా మంచి పెర్మాఫెమ్స్ ఇస్తుందని తయారీదారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ట్రాఫిక్ సమస్యలకు చెక్..

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచలోనే అత్యధిక జనాభా కలిగి ఉంది. ప్రజలు అన్ని సౌకర్యాలు ఉండే నగరాల్లోనే ఎక్కువగా నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఫలితంగా నగర ప్రాంతాల్లో జనసాంధ్రత గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో రోడ్లపై ట్రాఫిక్ అధికమవుతోంది. ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి ఈ కారును రూపొందించినట్లు తయారీ దారులు పేర్కొన్నారు. అన్ని వయసుల వారు దీనిని వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. పిల్లలను స్కూల్ లో దింపటానికి, నగర శివారుల్లో ఉద్యోగాలు చేసే వారు, వృద్ధులు అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని వివరిస్తున్నారు. స్టార్టప్ కంపెనీ వేవ్ మొబిలిటీ స్టార్టప్ గత రెండేళ్లుగా ఎవాపై పనిచేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన 2023 ఆటో ఎక్స్‌పోలో దీని నమూనాను జనవరి 11న ఆవిష్కరించారు. ఈ కారు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. 2024లో మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

సన్ రూఫ్ సోలార్ ప్యానెల్..

సోలార్ బ్యాటరీతో నడిచే సింగిల్ డోర్ కారులో 2+1 (ఇద్దరు పెద్దలు, ఒక బిడ్డ) సీటింగ్ కెపాసిటీ ఉంది. కొనుగోలుదారులు సోలార్ రూఫ్ ప్యానెల్‌ను ఎంచుకోవచ్చు. ఇది కారు పార్కింగ్ స్థలంలో ఓపెన్‌లో ఉన్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటుంది. బహిరంగ పార్కింగ్ స్థలాలు లేని వారు పనోరమిక్ సన్‌రూఫ్‌ని ఎంచుకోవచ్చు. పనోరమిక్ వ్యూ డ్రైవర్‌కు దృశ్యమానతను పెంచడంలో సహాయపడుతుంది. ఈ కారు కేవలం సౌరశక్తితో ప్రతిరోజూ 10-12 కి.మీల వరకు నడుస్తుంది. ఇది సంవత్సరానికి 3,000 కి.మీ. ప్రయాణిస్తుంది. ఒక సాధారణ కారు సంవత్సరానికి సగటున 9,000 కి.మీ ప్రయాణిస్తుంది. అంటే ఈ కారు వినియోగం వల్ల ఈ ఇంధన ఖర్చులో మూడింట ఒక వంతు సౌరశక్తి వల్ల తగ్గే అవకాశం ఉంటుంది.

మైలేజీ, సామర్థ్యం ఇలా..

సోలార్ కారు మైలేజ్ ఒక యూనిట్ విద్యుత్తుకు 20 కి.మీ. వరకు వెళ్లగలదు. ఎవా 14 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. 6 kW లిక్విడ్-కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది, ఇది 16HP పవర్, 40Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా అందుబాటులో ఉండే 15A సాకెట్ ద్వారా కారులోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. కారులో DC ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపిక కూడా ఉంటుంది. ఇది ప్లగ్-ఇన్ ఓవర్‌నైట్ ఆప్షన్‌తో పాటు 45 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేయగలదు. దీంతో వినియోగదారు తమ మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసినట్లుగా కారును ఛార్జ్ చేయవచ్చు. వర్షంలో లేదా సూర్యుడు లేని రాత్రి సమయంలోనూ దీనిని ఎలక్ట్రిక్ కారు వలె ఉపయోగించు కోవచ్చు. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్లు వెళ్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. గరిష్టంగా గంటకు 70 కి.మీ వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీనిలో ఆటోమేటిక్ డైవింగ్ ఆప్షన్ కూడా ఉంది. హైవేలపై ఈ ఆటోమేటిక్ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు.

ధర ఎంతంటే..

ఇవా ఎలక్ట్రిక్ కారు ధరను ఇంకా నిర్ణయించలేదు. స్టార్టప్ వారు దీనిని మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణంగా ఖరీదైనవి అయినప్పటికీ, వాటి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఎవా కిలోమీటరుకు 80 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని తయారీదారులు చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..