AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gemopai E-Scooter: ఈ స్కూటర్ డ్రైవ్ చేయడానికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరమే లేదట! ఒక్కసారి చార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు.. వివరాలు ఇవి..

దీనికున్న అదనపు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్కూటర్ నడపడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదని ఆ కంపెనీ ప్రకటించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Gemopai E-Scooter: ఈ స్కూటర్ డ్రైవ్ చేయడానికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరమే లేదట! ఒక్కసారి చార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు.. వివరాలు ఇవి..
Gemopai Astrid
Madhu
|

Updated on: Feb 04, 2023 | 4:50 PM

Share

అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు. అలాగే అధికమవుతున్న వాతావరణ కాలుష్యం. వీటి నుంచి బయటపడేందుకు సాధారణంగానే అందరూ ప్రత్నామ్నాయం వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే మార్కెట్లో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేస్తున్నాయి. టాప్ బ్రాండ్ల దగ్గర నుంచి, చిన్న చిన్న స్టార్టప్ ల వరకూ తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. ఇదే క్రమంలో జెమోపై ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లు, అదరగొట్టే మైలేజీతోపాటు ధర కూడా బడ్జెట్ లోనే ఉండేలా దీనిని ఆవిష్కరించారు. దీనికున్న అదనపు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్కూటర్ నడపడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదని ఆ కంపెనీ ప్రకటించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మూడు మోడ్లలో..

జెమోపై ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ మైలేజీ ఆప్షన్లలో వస్తుంది. దీనిలోని బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 90 కిలోమీటర్ల పరిధి వస్తుంది. వినియోగదారునికి మూడు మోడ్లలో ప్రయాణించే వీలుంటుంది. స్పోర్ట్స్, సిటీ, ఎకానమీ మోడ్లలో ప్రయాణం చేయవచ్చు. జెమోపై కంపెనీకి చెంది మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇదే. అందుకే దీని డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ వేగంగా కూడా వెళ్లగలదు. ఈ బండికి రిజిస్ట్రేషన్ చేయనవసరం లేదు. ఐదు కలర్ ఆప్షన్లలో ఇది లభ్యమవుతుంది. దేశంలో ప్రతి చోట ఇది అందుబాటులో ఉంది. ఆన్ లైన్ లేదా సమీప డీలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చు.

గంటకు 75 కిలోమీటర్ల వేగం..

“స్పోర్ట్స్ మోడ్”లో, ఈ స్కూటర్‌గంటకు 75 కిమీ వేగంతో వెళ్తుంది. దీని కారణంగా, ఏ రకమైన కొండపైనైనా పరుగెత్తడం చాలా సులభం. నగరంలో డ్రైవింగ్ కోసం సిటీ మోడ్ ఆప్షన్ ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పై 150 కిలోల వరకు బరువును మోయగలుతుంది. స్కూటర్‌లో బ్లూటూత్, మొబైల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి USB పోర్ట్, యాంటీ-థెఫ్ట్ అలారం, కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ లాక్ , డిజిటల్ కలర్ డిస్‌ప్లే వంటి అనేక ఇతర స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ధర ఎంతంటే..

ఆస్ట్రిడ్ లైట్ అనేది ఎలక్ట్రిక్ తయారు చేసిన గొప్ప ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 92,322. ఇది బ్యాటరీ పరిమాణాన్ని బట్టి 3 వెర్షన్లలో లభిస్తుంది. అత్యంత ఖరీదైన వెర్షన్ ధర రూ.1,11,195 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..