Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of electric vehicles: విద్యుత్ వాహనాలతో నిజంగా వాయు కాలుష్యం తగ్గుతుందా? ఈ అధ్యయనం తేల్చింది ఏంటి?

కర్భన ఉద్గారాల వల్ల శ్వాసకోశ వ్యాధులు, గుండె, మెదడు, ఇతర అవయవ వ్యవస్థలు ప్రభావితం అవుతాయని, కానీ విద్యుత్ వాహనాల వినియోగంతో వీటిని అదుపు చేయవచ్చని నిపుణులు బృందం అభిప్రాయ పడింది.

Benefits of electric vehicles: విద్యుత్ వాహనాలతో నిజంగా వాయు కాలుష్యం తగ్గుతుందా? ఈ అధ్యయనం తేల్చింది ఏంటి?
Electric Vehicles
Follow us
Madhu

|

Updated on: Feb 06, 2023 | 9:32 AM

వాతావరణ కాలుష్యం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. దీనిని నియంత్రించడానికి అందరూ సూచిస్తున్న ఏకైక విధానం కర్బన ఉద్గారాలను తగ్గించడం. అందుకోసం సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను వినియోగించాలని సూచిస్తున్నారు. పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ తయారీని చేపడుతున్నారు. అయితే నిజంగా విద్యుత్ వాహనాల వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందా? ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో వాతావరణం పరిశభ్రంగా మారి.. మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తుందా? ఇవే ప్రశ్నలకు పరిశోధకులకు కూడా వచ్చాయి. దీంతో వారు అనేక రకాల డేటాలు స్వీకరించి, విద్యుత్ వాహనాలు, వాతావరణ కాలుష్యం, మనిషి ఆరోగ్యం.. ఈ మూడింటిని అనుసంధానించి ప్రత్యేక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ఏం చెబుతోంది? నిజంగా విద్యుత్ వాహనాలు మనిషికి మంచి చేస్తున్నాయా? పరిశోధకులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం రండి..

పరిశోధకుల అధ్యయనం ఇలా..

యూఎస్సీ కి చెందిన కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల బృందం ఎలక్ట్రిక్ కార్లు, వాయు కాలుష్యం, మనిషి ఆరోగ్యాన్ని అనుసంధానించడానికి ప్రయత్నించింది. దీని కోసం వాస్తవ-ప్రపంచ డేటాను తీసుకొని అధ్యయనం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లను డాక్యుమెంట్ చేయడం ప్రారంభించింది. ముందుగా కాలిఫోర్నియాలో లైట్ డ్యూటీ జీరో ఎమిషన్ వెహికల్స్(ZEV) రిజిస్ట్రేషన్ వివరాలు స్వీకరించింది. అక్కడ వీటి వినియోగం వల్ల ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసింది. అలాగే అక్కడి ఆస్తమా పేషంట్ల వివరాలు కూడా తీసుకొని వారిని కూడా పరిశీలనలో పెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి ఫలితాలు, వివరాలు సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ప్రచురించారు.

ఏం చేశారంటే..

2013 నుండి 2019 మధ్య కాలిఫోర్నియా వ్యాప్తంగా మొత్తం ZEV వాహనాల రిజిస్ట్రేషన్లు, ఆసమయంలో అక్కడి వాయు కాలుష్య స్థాయిలు, ఉబ్బసం రోగులు వారికి సంబంధిత అత్యవసర గదిని వినియోగించుకున్న డేటాను పరిశోధకుల బృందం పోల్చింది. ఈ డేటా ఆధారంగా ఒకప్పుడు ఇంధన వాహనాలు వినియోగించినప్పుడు ఉబ్బసం రోగులు వారి అత్యవసర గదిని వినియోగించనప్పటితో పోల్చితే.. ZEV వాహనాల వినియోగం పెరిగిన తర్వాత ఉబ్బసం రోగులు చాలా వరకూ ఉపశమనం పొందారని, వారి అత్యవసర గదిని వినియోగించడం తగ్గించారని ఆ అధ్యయనంలో వెల్లడైంది. తద్వారా ఆ ప్రాంతంలో వాతావరణ కాలుష్యం కొంత వరకూ తగ్గిందని, స్థానికంగా మంచి గాలి అందుతోందని స్పష్టమైనట్లు పరిశోధకుల బృందం వివరించింది. ఇదే క్రమంలో ZEV వాహనాల వినియోగం మరింత పెరిగితే, వాయు కాలుష్యం బాగా తగ్గే అవకాశం ఉంటుందని, తద్వారా మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధకుల బృందం స్పష్టం చేసింది. కార్భన ఉద్గారాల వల్ల శ్వాసకోశ వ్యాధులు, గుండె, మెదడు, ఇతర అవయవ వ్యవస్థలు ప్రభావితం అవుతాయని, కానీ విద్యుత్ వాహనాల వినియోగంతో వీటిని అదుపు చేయవచ్చని నిపుణులు బృందం అభిప్రాయ పడింది. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ ఉపయోగించి బ్రేక్, టైర్ ముడి పదార్థాలు, వాటి తయారీ వాడే మైనింగ్, పాత కార్ల నిర్వహణ వంటివి వాయు కాలుష్యాన్ని పెంచుతాయని, వీటిని నియంత్రించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..