Suzuki electric scooter: సుజుకీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచింగ్ ఎప్పుడంటే..
ఇదే క్రమంలో సుజుకీ సంస్థ కూడా ఎలక్ట్రిక్ బైక్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా ఎనిమిది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మోడళ్లను ప్రవేశ పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. అందులో భాగంగా 2025లో భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి పరిచయం చేసేందుకు ప్రణాళిక చేస్తోంది.
మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల కు డిమాండ్ పెరిగింది. అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ వేరియంట్లోనే తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో సుజుకీ సంస్థ కూడా ఎలక్ట్రిక్ బైక్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా ఎనిమిది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మోడళ్లను ప్రవేశ పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. అందులో భాగంగా 2025లో భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి పరిచయం చేసేందుకు ప్రణాళిక చేస్తోంది. పాఠశాలలు, కార్యాలయాలు, మార్కెట్ వంటి అవసరాలకు వినియోగదారులకు మంచి ఎంపిక అయ్యేలా దీనిని తయారు చేస్తున్నట్లు సుజుకీ కంపెనీ పేర్కొంది. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్లానింగ్ ను ప్రకటించిన రెండో జపనీస్ కంపెనీగా సుజుకీ నిలిచింది. ఇప్పటికే హోండా కంపెనీ 2024 నాటికి ఎలక్ట్రిక్ హోండా యాక్టివాను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఎప్పుడు ప్రకటించిందంటే..
గ్లోబల్ ప్రెస్ రిలీజ్‌లో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2025లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కమ్యూటర్ టూ-వీలర్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంది. సుజుకీ ప్రకటలో ద్విచక్ర వాహనం అని ఉంది కానీ.. అది బైకా లేక స్కూటర్ అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. అయితే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం సుజుకీ తీసుకొస్తున్న కొత్త ద్విచక్ర వాహనం ఎలక్ట్రిక్ స్కూటర్ అని తెలుస్తోంది. ఇది కూడా బర్గ్ మ్యాన్ మ్యాక్సీ తరహా స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. బర్గ్ మ్యాన్ ఎలక్ట్రిక్ ప్లాట్ ఫారమ్ ఆధాంగా సుజుకీ కంపెనీ ఇప్పటికే మిడ్ సైజ్ స్కూటర్ ను కూడా పరిచయం చేసింది. గత రెండు సంవ్సతరాలుగా దీపిపై పలు పరీక్షులు కూడా నిర్వహించింది.
25 శాతం ఎలక్ట్రిక్ వాహనాలనే..
సుజుకీ కంపెనీ భారత దేశంలో ఇకపై తీసుకొచ్చే బైక్ లు ఎక్కువగా ఎలక్ట్రిక్ వేరియంట్ వే తీసుకురావాలని భావిస్తోంది. 2030 ఆర్థిక సంవత్సరానికి తన ఉత్పత్తిలో దాదాపు 25 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. అలాగే 2030 నాటికి భారతదేశంలో ఎనిమిది కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించనున్నట్లు వివరించింది.
సాధారణ అవసరాలకే మొగ్గు..
ప్రజల సాధారణ అవసరాలను తీర్చేలా జపనీస్ బ్రాండ్లు అయిన సుజుకీ, హోండా ప్రయత్నిస్తున్నాయి. పాఠశాలలు, కార్యాలయాలు, మార్కెట్ వంటి అవసరాలకు వినియోగదారులకు మంచి ఎంపిక అయ్యేలా తీర్చిదిద్దుతున్నాయి. ప్రస్తుతానికి అధిక పనితీరు ప్రదర్శించే స్పోర్టీ ఎలక్ట్రిక్ బైక్ తయారీపై ఈ రెండు కంపెనీలు పెద్ద గా ఆసక్తి చూపడం లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..