Electric car: టాటా నానో కన్నా చిన్న కారు! బైక్ పట్టేంత స్థలం చాలు.. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 180 కిలోమీటర్లు.. వివరాలు ఇవి..
ఇప్పుడు మీకు చెప్పబోయే కారు టాటా నానో కన్నా చిన్నగా ఉంటుంది. ఎంత ట్రాఫిక్ లో అయినా బైక్ లా దూసుకుపోగలుతుంది. పైగా దీనిలో ఒక సాధారణ కారులో ఉండే అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయి.
టాటా నానో.. రతన్ టాటా కలల కారు. సామాన్యునికి కారు అందుబాటులో ఉంచాలని భావించి ఆవిష్కరించారు. అయితే అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే కారు టాటా నానో కన్నా చిన్నగా ఉంటుంది. ఎంత ట్రాఫిక్ లో అయినా బైక్ లా దూసుకుపోగలుతుంది. పైగా దీనిలో ఒక సాధారణ కారులో ఉండే అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ఇజ్రాయేల్ కు చెందిన ఓ కంపెనీ దీనిని ఆవిష్కరించింది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రాఫిక్ కష్టాలకు చెక్..
ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ట్రాఫిక్ సంక్షోభం ఒకటి. పట్టణీకరణ కారణంగా, ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకే ప్రాంతంలో నివసించడం ప్రారంభించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. ఫలితంగా, కార్లను నగరాల్లో వినియోగించలేని పరిస్థితి. అవి ట్రాఫిక్ లో చిక్కుపోతాయి. గమ్యస్థానానికి చేరడానికి ఆలస్యం అయిపోతుంది. దీంతో సిటీ పరిధిలో చాలా మంది బైకులు లేదా స్కూటర్లను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే కార్లు పెద్దగా ఉంటాయి. అయితే ఈ బైక్ లను వాడటం కూడా ఇబ్బందే . రోడ్లపై దుమ్మూ, ధూళి అంతా ఒంటిపైనే పడుతుంది. ఎండ, వాన ఇలా అనేక సమస్యలుంటాయి. ఈ సమస్యలన్నింటికీ సింగిల్ ఇన్వెన్షన్ తో చెక్ చెప్పింది ఇజ్రాయెలీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ సిటీ ట్రాన్స్‌ఫార్మర్స్. CT2 పేరిట సరికొత్త కారును ఆవిష్కరించింది.
బైక్ లా నడపగలిగే కారు..
సిటీ ట్రాన్స్‌ఫార్మర్స్ దాని కాంపాక్ట్ అర్బన్ ఈవీ CT-2ని ప్రదర్శించింది. ఈ కారు పూర్తిగా బ్యాటరీతో నడుస్తుంది. అధిక ట్రాఫిక్‌లో, బైక్‌లా డ్రైవింగ్ చేయడానికి అనువైన కారు ఇది. అంతే కాక, ఈ కారుకు ఎక్కువ స్థలం అవసరం లేదు. తక్కువ స్థలంలో పార్క్ చేయవచ్చు. ఈ కారు వెడల్పు కేవలం 1 మీటర్ మాత్రమే. సంప్రదాయ కారును పార్క్ చేయడానికి అవసరమైన స్థలంలో ఈ కారు 4 కార్లను పార్క్ చేయగలదని కంపెనీ తెలిపింది. అంతేకాక ఈ కారులో డ్రైవర్ పాటు వెనుక సీటులో మరో ప్రయాణికుడు కూర్చోగలిగేంత స్థలం ఉంటుందని ఆ కంపెనీ పేర్కొంది.
ఒక్కసారి చార్జ్ చేస్తే 180 కిలోమీటర్లు..
ఈ కారు ఫుల్ ఛార్జింగ్ తో 180 కి.మీ వరకు ప్రయాణించగలుగుతుంది. ఈ కారు గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. సిటీ ట్రాన్స్‌ఫార్మర్స్ ఈ CT2 కారు ఉత్పత్తిని 2024లో ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వెస్ట్రన్ యూరప్‌లోని కంపెనీ ప్లాంట్‌లో ఈ కారును తయారు చేయనున్నారు. ఈ కారు ధర దాదాపు 16,000 యూఎస్ డాలర్లు ఉండే అవకాశం ఉంది. అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 13 లక్షలు. సబ్సిడీ పొందినట్లయితే ఈ కారు దీని కంటే తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కారు యూరప్‌లో మాత్రమే లాంచ్ అవుతోంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఇండియా లాంటి దేశాల్లో ఇలాంటి కార్లు అందుబాటులో ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. నగర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పార్కింగ్ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..