Airtel New Plan: ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ప్లాన్ వ్యాలిడిటీ పెరిగిందోచ్చ్..!
గతంలో ఎయిర్ టెల్ లాంచ్ చేసిన రూ.359 ప్లాన్ పై వ్యాలిడిటీను పెంచుతూ సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకొచ్చింది. డైలీ అధిక డేటా వాడే వారిని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన రూ.359 ప్లాన్ పై మూడు రోజులు వ్యాలిడిటీ ను పెంచింది.
భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్ టెల్ మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో ముందుకొచ్చింది. టెలికాం రంగంలోకి జియో ఎంట్రీతో డేటా ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కంపెనీలు కూడా జియో బాటలో నడవాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో గట్టి పోటినివ్వడానికి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను లాంచ్ చేస్తుంది. గతంలో ఎయిర్ టెల్ లాంచ్ చేసిన రూ.359 ప్లాన్ పై వ్యాలిడిటీను పెంచుతూ సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకొచ్చింది. డైలీ అధిక డేటా వాడే వారిని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన రూ.359 ప్లాన్ పై మూడు రోజులు వ్యాలిడిటీ ను పెంచింది. అలాగే ఇంకా ఎన్నో సబ్ స్క్రిప్షన్ ప్యాక్ లను కూడా అందిస్తుంది. ఎయిర్ టెల్ రూ.359 ప్యాక్ పై అందించే ఆఫర్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
రూ.359 ప్లాన్ ఏంటి?
రూ. 359 ప్లాన్ లో రోజూ 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ తో పాటు, రోజుకు 100 SMSలతో 28 రోజుల వ్యాలిడిటీ తో వచ్చేది. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్, అపోలో 24|7 సర్కిల్‌కు 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, హలో ట్యూన్స్, వింక్‌లకు ఉచిత యాక్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మారిన ప్లాన్ ఏంటి?
ప్రస్తుతం ఈ ప్లాన్ వ్యాలిడిటీని మాత్రం మూడు రోజులు పెంచింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల టెలికాం కంపెనీలు 30 రోజులు లేదా ఒక నెల వ్యాలిడిటీతో ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని కోరింది. దీంతో ఎయిర్ రూ.359 ప్లాన్ పై వ్యాలిడిటీను 31 రోజులకు పెంచింది.
రూ.359 ప్లాన్ పై ప్రస్తుతం వచ్చే ఆఫర్స్
- రోజుకు 2 జీబీ డేటా
- అపరిమిత లోకల్ అండ్ ఎస్ టీడీ కాల్స్
- రోజుకు 100 ఎస్ఎంస్ లు
- ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ యాప్ కు 28 రోజుల సబ్ స్క్రిప్షన్
- అపోలో 24/7 యాప్ కు 3 నెలల సబ్ స్క్రిప్షన్
- ఫాస్ట్ ట్యాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..