Airtel Plans: జియోకు పోటీగా ఎయిర్‌టెల్.. కొత్త డేటా ప్లాన్.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో చర్చలు..!
Airtel Plans: టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతూ ఇతర టెలికాం సంస్థలకు పోటీగా మారిపోతుంది. ఇప్పటికే జియో రకరకాల ఆఫర్లను పెడుతూ కస్టమర్లను..
Airtel Plans: టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతూ ఇతర టెలికాం సంస్థలకు పోటీగా మారిపోతుంది. ఇప్పటికే జియో రకరకాల ఆఫర్లను పెడుతూ కస్టమర్లను మరింత ఆకట్టుకుంటోంది. జియో ఆఫర్లతో ఇతర టెలికాం సంస్థలు సైతం వెనుకబడిపోతున్నాయి. జియో మొబైల్ టారిఫ్ ఛార్జీలను గణనీయంగా తగ్గించడంతో ఇతర టెలికాం సంస్థలు కూడా టారిఫ్ ఛార్జీలను తగ్గించాల్సిన వచ్చింది. భారత టెలికాం రంగంలో తనదైన ముద్ర వేయడం కోసం జియో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్‌ను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్స్ కొరతతో జియోఫోన్ నెక్ట్స్ లాంచ్‌కు బ్రేకులు పడింది. జియోఫోన్ నెక్ట్స్‌ను దీపావళికి రిలీజ్ చేస్తోందని రిలయన్స్ ప్రకటించింది.
కొత్త ప్లాన్‌తో ఎయిర్‌టెల్
జియోఫోన్ నెక్ట్స్‌ను ఎదుర్కొనేందుకుగాను ఎయిర్‌టెల్ కొత్తప్లాన్‌తో ముందుకు వస్తోంది. పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో ఎయిర్‌టెల్ ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ఆయా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై బండిల్ డేటా ప్యాక్‌లను, వాయిస్ ఆఫర్లను అందించాలని ఎయిర్‌టెల్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రణాళికతో ఎయిర్‌టెల్‌కు చెందిన 2జీ సబ్‌స్రైబర్స్ బేస్‌ను రక్షించుకోవాలనే లక్ష్యాన్ని కంపెనీ పెట్టుకుంది.
స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో చర్చలు..
కాగా, పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో చర్చలను జరిపేందుకు ప్రతిపాదనలను ఎయిర్‌టెల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. లావా, కార్బాన్, హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో ఎయిర్‌టెల్ చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎయిర్‌టెల్ పలు కంపెనీల హ్యాండ్‌సెట్ బ్రాండ్‌లతో పొత్తుతో పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై ఎయిర్‌టెల్ పలు ఆఫర్లను అందించాలని భావిస్తోంది. టెలికాం రంగంలో జియో యూజర్లను పెంచుకుంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుండటంతో దూసుకుపోతోంది. జియో పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్ కూడా ముందుకెళ్తోంది. జియో ఇప్పటికే రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఎయిర్‌టెల్ కూడా అందుకు తగినట్లుగానే ఆఫర్లను తీసుకువస్తోంది. ఇప్పుడు తాజాగా ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకు వచ్చింది.
ఇక కొంత కాలంగా స్థబ్ధుగా ఉన్న ఓటీటీలోకి ఈవారం నుంచే కొత్త సినిమాలు సందడి మొదలయ్యాయి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతీ వారం మూడునాలుగు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీలో సినిమాలు చూడాలంటే మొబైల్ డేటాతో ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి ఈ సమస్యకు పరిష్కారంగా ఎయిర్‌టెల్ సంస్థ కొత్త డేటా టాప్ అప్ ప్లాన్‌ని అమల్లోకి తీసుకువచ్చింది.
రూ. 119 డేటా ప్లాన్‌తో..
ప్రత్యేకంగా డేటాను అందించడానికి రూ.119 ప్లాన్ ప్యాక్‌ను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టాప్ అప్ ప్యాక్‌తో 15 జీవీ 4జీ డేటా లభిస్తుంది. వినియోగదారులు ప్రస్తుతం ఏ ప్యాకేజీలో ఉన్నారో ఆ ప్యాకేజీ గడువు ముగిసే వరకు ఈ డేటా అందుబాటులో ఉంటుంది. కాల్స్, వ్యాలిడిటీలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా డేటాను అందించడానికే ఈ ప్యాక్‌ను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.